Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా సంస్థ యజమాని శ్రవణ్‌రావు బుధవారం మరోసారి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఎదుట హాజరుకానున్నారు. గత విచారణలో ఆయనను అడిగిన ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇవ్వకపోవడంతో, అధికారులు ఆయనకు తిరిగి నోటీసులు పంపారు.
ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారంతా పోలీసు అధికారులే కాగా, శ్రవణ్‌రావు మాత్రం ప్రైవేట్ వ్యక్తి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన జోక్యం చేసుకున్నారు? ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్ అధికారులతో ఆయనకు పరిచయం కల్పించినది ఎవరు? ఆయన కార్యాలయంలో హ్యాకింగ్ పరికరాలను ఏర్పాటు చేయడానికి ప్రణీత్‌రావు వెనుక కారణమేమిటి? ఈ వ్యవహారంలో ఎవరెంత మంది సంభాషణలను విన్నారు? దీని ద్వారా ఎవరైనా ఆర్థికంగా లబ్ధి పొందారా? అనే అంశాలపై అధికారులు స్పష్టత తీసుకురావాలని భావిస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీ నేతలు, రేవంత్ రెడ్డి అనుచరుల ఫోన్ నంబర్లు ట్యాపింగ్ టీంకు ఎందుకు అందించబడ్డాయి? ఆ వివరాలను శ్రవణ్‌రావుకు అందించినది ఎవరు? గత ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులకు ఆయన ఏ సమాచారాన్ని ఇచ్చారు? వంటి ప్రశ్నలపై SIT మరింత లోతుగా విచారణ జరుపుతోంది.
ఇప్పటికే అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, శ్రవణ్‌రావులను ముఖాముఖి విచారణకు సిద్ధమవుతున్నారు. శ్రవణ్‌రావు తనకు ప్రణీత్‌రావుతో మాత్రమే పరిచయం ఉందని చెబుతున్నప్పటికీ, రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలతో ఆయన జరిపిన ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరందరినీ కూడా విచారణకు పిలవాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.
LSG vs PBKS: దంచికొట్టిన ప్రభ్ సిమ్రాన్.. లక్నోపై పంజాబ్ విజయం