కొత్త డిజైన్, స్మూత్ యానిమేషన్లతో Android 17 Beta.. ఎలా ఇన్‌స్టాల్ చేయాలో తెలుసా?
- Google Pixel ఫోన్లకు అందుబాటులోకి వచ్చిన Android 17 బీటా..
- ఫీచర్లు టెస్టింగ్ కోసం అందుబాటులోకి వచ్చిన Android 17 Beta..
- డిజైన్ మార్పులు, స్మూత్ యానిమేషన్లు, క్విక్ సెట్టింగ్స్‌లో మెరుగుదలలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google అధికారిక ప్రకటన తర్వాత Android 17 బీటా 1 వెర్షన్ ఇప్పుడు అర్హత ఉన్న Google Pixel ఫోన్లకు అందుబాటులోకి వచ్చింది. ఇది Android Beta ప్రోగ్రామ్ ద్వారా రోలౌట్ అవుతోంది. ఈ మొదటి బీటా వెర్షన్‌లో పని తీరు, ప్రైవసీ, సెక్యూరిటీపై ప్రధానంగా దృష్టి పెట్టారు. అలాగే, డెవలపర్ల కోసం కొత్త టూల్స్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మునుపటి లాగానే Developer Preview ఇవ్వకుండా, ఈసారి గూగుల్ నేరుగా బీటా వెర్షన్ ని రిలీజ్ చేసింది. “Canary” అనే కొత్త ఛానల్ ద్వారా ముందస్తు ఫీచర్లు టెస్టింగ్ కోసం అందుబాటులో ఉంటాయి.
Read Also: US-Iran: అమెరికా-ఇరాన్ అణు చర్చలు విఫలం.. మధ్యప్రాచ్యంలో మళ్లీ టెన్షన్
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
కొత్తగా వచ్చిన మార్పులు:
Android 17లో చిన్న డిజైన్ మార్పులు, స్మూత్ యానిమేషన్లు, క్విక్ సెట్టింగ్స్‌లో మెరుగుదలలు ఉన్నాయి. టాబ్లెట్లు, ఫోల్డబుల్ డివైసుల కోసం స్క్రీన్ ఓరియెంటేషన్, రీసైజ్ ఆప్షన్‌లపై నియంత్రణ ఇచ్చారు. ఇక Pixel ఫోన్లలో “At a Glance” విడ్జెట్‌ను ఆఫ్ చేసే ఆప్షన్ కూడా ఇచ్చారు. కెమెరా యాప్‌ల కోసం ప్రొఫెషనల్ టూల్స్, మెరుగైన మీడియా ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే, యాప్‌లు లొకేషన్, మైక్రోఫోన్, కెమెరా యాక్సెస్ తీసుకున్నప్పుడు స్పష్టంగా చూపించే విధంగా అనుమతి (permissions) సెట్టింగ్స్ మెరుగుపరిచారు. క్విక్ సెట్టింగ్స్‌లో లొకేషన్ ఇండికేటర్‌ను పెద్దగా చూపిస్తున్నారు. అయితే, గతంలో లీక్ అయిన కొన్ని పెద్ద డిజైన్ మార్పులు ఈ బీటాలో కనిపించలేదు. అవి తరువాతి బీటా లేదా Canary వెర్షన్‌లో వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి, Android 17 బీటా పెద్ద మార్పులు కాకుండా చిన్న చిన్న మెరుగుదలలతో వచ్చింది. ఇంకా వచ్చే బీటా వెర్షన్లలో మరిన్ని ఫీచర్లు రావచ్చు.. స్థిరమైన (stable) వెర్షన్ నాలుగు నుంచి ఐదు నెలల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
Read Also: Suhas : రోల్ అని పిలిచి అవమానించారు.. కట్ చేస్తే అదే స్టార్ హీరోయిన్ పక్కన హీరోగా చేశా..!
Android 17 Beta అందుబాటులో ఉన్న Pixel డివైసులు:
* Pixel 6, 6 Pro, 6a
* Pixel 7, 7 Pro, 7a
* Pixel Tablet
* Pixel Fold
* Pixel 8, 8 Pro, 8a
* Pixel 9 సిరీస్
Pixel 10 సిరీస్
Android 17 Beta ఎలా ఇన్‌స్టాల్ చేయాలి?
* ముందుగా మీ డేటా బ్యాకప్ తీసుకోండి.
* Android Beta ప్రోగ్రామ్ వెబ్‌సైట్‌కి వెళ్లి Google అకౌంట్‌తో సైన్ ఇన్ చేయండి.
* మీ Pixel డివైస్‌ను ఎంపిక చేసుకోండి.
* ఫోన్‌లో Settings → Software Update కి వెళ్లండి.
* అప్డేట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
తాజావార్తలు
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?