Lakshmi Narasimha Swamy Temple మన జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు, మనసు ప్రశాంతతను కోల్పోయినప్పుడు… చాలామంది భగవంతుడిని ఆశ్రయిస్తుంటారు. ఆ దైవ దర్శనం, ఆశీస్సులు మనకు ఎంతో ధైర్యాన్ని, మానసిక బలాన్ని ఇస్తాయి. హైదరాబాద్ మహానగరంలో, కోఠిలో వెలసిన ఒక ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఒక్క దర్శనంతోనే భక్తుల సమస్యలన్నీ దూరం అవుతాయని, కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. ఆ శక్తివంతమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం విశేషాలు ఏంటో ఇప్పుడు […]
Bars Draw : తెలంగాణ రాష్ట్రంలో 28 కొత్త బార్లకు గాను ఈరోజు ఆబ్కారీ శాఖ లాటరీ పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేసింది. ఈ లాటరీ ప్రక్రియ శుక్రవారం నార్సింగ్‌లోని ది అడ్రస్ కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్ హాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరి కిరణ్ నేతృత్వంలో నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు 3,520 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని నాలుగు బార్లకు మరో 148 […]
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లో సాంకేతికలోపం.. చివరికీ.. భారత వైమానిక దళానికి చెందిన M17 అపాచీ హెలికాప్టర్ శుక్రవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో జరిగిన నష్టంపై అధికారిక సమాచారం అందలేదు. వాస్తవానికి.. పఠాన్‌కోట్ వైమానిక దళ కేంద్రం నుంచి బయలుదేరిన హెలికాప్టర్, సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నట్లు సమాచారం అందడంతో ముందుజాగ్రత్తగా బహిరంగ ప్రదేశంలో ల్యాండ్ అయింది. హెలికాప్టర్ దిగుతున్నట్లు చూసిన […]
Telangana Rains : తెలంగాణలో వర్షాల హడావుడి మొదలైంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో మరింత విస్తరించడంతో వర్షాలు పలుచోట్ల కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని, ప్రధానంగా దక్షిణ , పశ్చిమ తెలంగాణలో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల […]
Telangana Aviation Director : అహ్మదాబాద్‌లో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి కొన్ని అపోహలు ప్రజల్లో ప్రచారంలో ఉన్నాయని ఆయన అన్నారు. విమాన సాంకేతికత, భద్రతా ప్రమాణాల గురించి స్పష్టత ఇవ్వడం కోసం ఆయన పలు ముఖ్యమైన విషయాలను వివరించారు. భరత్ రెడ్డి మాటల ప్రకారం, ఒక ఇంజన్ ఆగిపోతే మరొకటి పని చేస్తుందన్న భావన సరికాదని […]
POCSO : రాజమండ్రిలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికను గర్భవతి చేసి ఓ యువకుడు ముఖం చాటేశాడు. అంతేకాకుండా… కులం తక్కువ దానివంటూ దూషిస్తూ.. ఆ బాలికకు అబార్షన్ చేయించాడు ఆ దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే.. మోరంపూడి ప్రాంతానికి చెందిన పులపర్తి సత్యదేవ్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని శారీరకంగా లోబర్చుకొని గర్భవతిని చేశాడు.. 2024 నవంబర్ నెలలో మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ […]
Tummala Nageswara Rao : వ్యవసాయ రంగాన్ని కేంద్రంగా చేసుకుని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలు రైతుల ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలిచాయి. ప్రస్తుతంగా రైతుల అవసరాలపై, పథకాల అమలుపై ఆయన చేసిన వ్యాఖ్యలు పరిశీలనకు వస్తే, ప్రభుత్వం రైతుకు తోడుగా నిలుస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. రైతుల రుణ భారం తగ్గించేందుకు పాత రుణాల మాఫీ పూర్తయ్యిందని మంత్రి తెలిపారు. “రైతు బంధు పేరుతో గతంలో అన్ని పథకాలు ఆపేశారు. కానీ […]
Air India Flight Crash Live Updates : అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తక్కువ ఎత్తులో విహరించి, మేఘానీనగర్‌లోని ఘోడాసర్ క్యాంప్ సమీపంలో నివాస ప్రాంతాల్లో కూలిపోయింది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు పేర్కొంటున్నారు. అందులో పలువురు వీఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి […]
Bhatti Vikramarka : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జాతీయ స్థాయి CA విద్యార్థుల సదస్సులో భాగంగా ముఖ్యోపన్యాసం ఇచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. “CA అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, ఇది జాతి నిర్మాణంలో భాగస్వామ్యం. దేశ ఆర్థిక ఆరోగ్య భద్రతను చార్టెడ్ అకౌంట్లు సమర్థంగా నిర్వహిస్తున్నారు,” అని చెప్పారు. అనంతరం మాట్లాడుతూ, “మీ నిజాయితీయే మీ అత్యంత విలువైన ఆస్తి. టెక్నాలజీ, ఆటోమేషన్ […]
Story Board : హైదరాబాద్ చుట్టూ డేంజర్ జోన్ ఏర్పడింది. సిటీ చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌసులు, రిసార్టుల్లో తరచుగా డ్రగ్స్, రేవ్ పార్టీలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పుడు మంగ్లీ బర్త్ డే పార్టీ రచ్చతో మరోసారి ఈ చర్చ తెరపైకి వచ్చింది. వీటికి తోడుగా సిటీలో పబ్ కల్చర్ ఉండనే ఉంది. నగరం నిద్రపోతున్నవేళ జరిగే కార్యకలాపాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. Harish Rao : ఇది మార్పా రేవంత్ […]