Ragging : సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి సురభి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న కాలేజీలో జాయిన్ అయిన ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థి సాయి (18)ను అదే కాలేజీకి చెందిన రెండో సంవత్సరం విద్యార్థులు ర్యాగ్ చేసినట్లు సమాచారం. గడ్డం ఎందుకు పెంచుకున్నావని సీనియర్లు ప్రశ్నించగా, దేవుడికి మొక్కు ఉందని చెప్పినా వినకుండా ట్రిమ్మర్‌తో గడ్డం తీయించినట్లు బాధిత విద్యార్థి ఆరోపించాడు. ఇంతటితో ఆగకుండా, మరోసారి గడ్డం పెంచితే బాగుండదని క్లాస్‌రూమ్‌లోనే గుంజీలు తీయించి బెదిరించినట్లు వెల్లడించాడు.
Man Kills Sister: బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడినందుకు సోదరిని చంపిన వ్యక్తి..
ర్యాగింగ్‌పై యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు కూడా అక్కడి అధికారులు సీనియర్లకే సపోర్ట్ చేస్తున్నారని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ఫిర్యాదు చేశావని సీనియర్లు తనను దుర్భాషలతో దూషించారని తెలిపాడు. విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు కాలేజీలో విచారణ చేపట్టారు. ర్యాగింగ్ నిరోధక చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు విద్యాసంస్థల్లో కొనసాగుతున్నందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.