మానవసేవే మాధవసేవ అన్న నానుడి స్ఫూర్తిగా తీసుకున్న ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు సామాజిక సేవపై దృష్టి సాధించాడు. అతనే అవధానాల వసంత శర్మ. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన అవధానుల వసంతశర్మ (81) విశ్రాంత ఉపాధ్యాయుడు. 2004 సంవత్సరంలో ఉద్యోగ విరమణ పొంది శేష జీవితం గడుపుతున్నారు. 2000 సంవత్సరం నుంచి నేటికీ ప్రతిరోజూ ఉదయం మంథనిలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో రోగులకు వారి బంధువులకు ఉచితంగా పాలు పోస్తూ బిస్కెట్లను అందిస్తున్నారు.
Railway Rules: ట్రైన్ లో ఎలక్ట్రిక్ కెటిల్ వాడితే.. ఎన్నేళ్ల జైలు శిక్ష విధిస్తారో తెలుసా?
రోగుల సంఖ్యకు అనుగుణంగా రెండు, మూడు లీటర్ల నుంచి 5 లీటర్ల పాలను అందజేస్తారు. ప్రతిరోజు ఇంటి వద్ద పాలు వేడి చేసుకుని ఉదయం 7:30 వరకు వైద్యశాలకు వెళ్లి పాలను పంపిణీ చేయడం తన దినచర్యగా చేసుకున్నారు. వైద్యశాలలో వార్డుల్లోకి వెళ్లి పాలు పోస్తానంటూ రోగులను ఆత్మీయంగా పిలుస్తారు. ప్రభుత్వ ఆసుపత్రి కావడం ఇక్కడకు వచ్చే రోగులంతా పేదలే కావడంతో ప్రతి ఒక్కరూ పాలను తీసుకుంటూ ఉంటారు. 81 ఏళ్ల వయసులో ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి పాలు పంపిణీ చేయడం అభినందనీయమని ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది పేర్కొంటున్నారు. అలాగే గోవులకు ప్రతిరోజు దాన పెట్టడం అలవాటుగా మార్చుకున్నారు.