దేవాదాయ శాఖ ఉద్యోగుల బదిలీలు అక్కడ కూటమిలో కుంపట్లు పెట్టాయా? మా మాటకు విలువే లేకుండా పోయిందని జనసేన, బీజేపీ శాసనసభ్యులు రగిలిపోతున్నారా? కేవలం టీడీపీ అనుకూలురకే మేళ్ళు జరిగాయన్నది నిజమేనా? లక్షలకు లక్షలు చేతులు మారాయన్న ఆరోపణలు ఎందుకు వచ్చాయి? అసలా బదిలీల బాగోతం ఏంటి? ఎక్కడ జరిగింది? ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దేవాదాయ శాఖ ఉద్యోగుల బదిలీలు… కూటమిలో చిచ్చు రేపుతున్నాయట. తమ సిఫారసు లేఖలను అస్సలు పట్టించుకోవండ లేదంటూ…. జిల్లాకు చెందిన […]
గుప్తనిధుల పేరిట ప్రజలను మోసం చేస్తున్న దొంగ స్వాములను కరీంనగర్ పోలీస్ లు అరెస్టు చేశారు.శ్రీరాముల పల్లె గ్రామనికి చెందిన గజ్జి ప్రవీణ్ ఇంట్లో ఆరోగ్యం బాగో ఉండడం లేదు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని దొంగ స్వాములను ఆశ్రయించాడు .మీ ఇంటి పక్కనే క్వింటాల్ వరకు బంగారం కడ్డీ ఉందని, దానిని బయటికి తీసి పూజలు చేస్తే మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుపడుతుందని, లేకపోతే మీ ఇంట్లో వారు చనిపోతారని నమ్మబలికారు దొంగ స్వాముల ముఠా . […]
తెలంగాణ కాంగ్రెస్ విషయంలో ఏఐసీసీ పెద్దలకు క్లారిటీ లేకుండా పోయిందా? తొమ్మిది నెలల నుంచి పోస్ట్‌ల భర్తీలో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతోంది? అరకొర కమిటీతో ఇంకెన్నాళ్ళు బండి లాగిస్తారు? అత్యంత కీలకమైన పదవుల భర్తీకి ఇంకెన్నేళ్ళు పడుతుంది? పార్టీ పెద్దల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదా? లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా….మహేష్ గౌడ్‌ను నియమించిన ఏఐసీసీ ఆయనకి టీంని సమకూర్చడానికి తొమ్మిది నెలలు పట్టింది. అయినాసరే… ఇప్పటికీ పూర్తి స్థాయిలో పీసీసీ కమిటీ నియామకం […]
CM Revanth Reddy : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని… ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని సీఎం వెల్లడించారు. […]
భవనం పైకప్పుపై దొరికిన బ్లాక్ బాక్స్.. అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాద ఘటనకు కారణాలు తెలుసుకునేందుకు కీలకమైన ‘‘బ్లాక్ బాక్స్’’ దొరికింది. విమానం కూలిపోతున్న సమయంలో సమీపంలోని డాక్టర్స్ హాస్టల్స్ భవనాన్ని ఢీకొట్టింది. ఇప్పుడు అదే బిల్డింగ్ పైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. దీంతో, 265 మందిని బలి తీసుకున్న ఈ ఘోర దుర్ఘటనకు కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) పూర్తిస్థాయిలో పని ప్రారంభించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన […]
ఆ మాజీ ఎమ్మెల్యే కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయా? ఆయన మాటలు ఇప్పుడే ఎందుకు తేడాగా వినిపిస్తున్నాయి? మామీద మీ పెత్తనం ఏంటి? ఎక్కువ చేస్తే… పార్టీ ఆఫీస్ మెట్లు కూడా ఎక్కబోమని ఎందుకు అంటున్నారు? చచ్చేదాకా వైసీపీలోనే ఉంటానని ఒకవైపు చెబుతూనే… మరోవైపు స్వరం మారుస్తున్న ఆ మాజీ ఎవరు? ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఉత్తరాంధ్ర వైసీపీలో ఒక్కొక్కటిగా అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయా అంటే… అవును, అలాగే కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పండిట్స్. అందుకు తాజా ఉదాహరణగా… […]
కాళేశ్వరం కమిషన్ విచారణలో సరికొత్త ట్విస్ట్‌లు ఉండబోతున్నాయా? బీఆర్ఎస్ ముఖ్యులు ఇంకా ఇరుక్కుంటున్నారా? ఆ మంత్రి…. మాజీ మంత్రుల్ని గట్టిగా ఇరికించేస్తున్నారా? కమిషన్‌కు ముగ్గురు ముఖ్యులు ఇచ్చిన వాంగ్మూలాల్లో వాస్తవం లేదంటూ…. తన దగ్గరున్న ఆధారాలను కమిషన్ ముందు పెట్టారా? ఎవరా మంత్రి? ఇప్పుడేం జరిగే అవకాశం ఉంది? తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణే హాట్ టాపిక్. బ్యారేజీ పియర్స్ కుంగుబాటుపై కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ విచారణ చివరి దశకు చేరుకుంది. […]
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఆ సామాజికవర్గం అలకబూనిందా? ఎప్పుడూ పైచేయిగా ఉండే…. మమ్మల్ని ఇప్పుడు పట్టించుకోవడం లేదంటూ నారాజ్ అవుతున్నారా? ఇటీవల జరిగిన పరిణామాలను ఆ కుల పెద్దలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారా? అధికార పార్టీ మీద కోపంగా ఉన్న ఆ సామాజికవర్గం ఏది? ఎక్కడ తేడా కొట్టింది? తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అంటేనే…. రెడ్ల పార్టీ అని ఓ ముద్ర ఉంది. రాజకీయ వర్గాల్లో కూడా ఇదే విస్తృతాభిప్రాయం. లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా… ఆ […]
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఏసీబీ అధికారులు తనకు జారీ చేసిన నోటీసులపై స్పందించిన ఆయన, సోషల్ మీడియాలో ఓ పోస్టు ద్వారా స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, పాలన చేయడం చేతకాని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఒక్కో రోజు ఒక్కో డ్రామా వేస్తున్నాడు. ఈ చిల్లర కుట్రలతో మమ్మల్ని ఆపలేరు. […]
ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన ఆ అక్కచెల్లెళ్ళ మధ్య ఏదో జరుగుతోందా? ఇబ్బంది వచ్చినప్పుడు కూడా కనీసం ఒకర్ని ఒకరు పరామర్శించుకోలేనంత అగాధం పెరిగిపోయిందా? సినిమా, రాజకీయం కలగలిసిపోయినట్టుగా ఉండే ఆ సిస్టర్స్ ఎవరు? వాళ్ళ మధ్య సఖ్యత లేదన్న అనుమానాలు ఇప్పుడెందుకు వచ్చాయి? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను వివాదాలు చుట్టుముడతాయో… లేక ఆమే వివాదాలను వెతుక్కుంటూ వెళ్తారో తెలీదుగానీ… ఎప్పుడూ ఏదోఒక వివాదాస్పద టాపిక్‌తో చర్చల్లో వుంటున్నారు ఆమె. […]