CM Revanth Reddy : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాబోయే రెండేండ్లలో.. 2027 జూన్ నాటికి రాష్ట్రంలో కృష్ణా పై అసంపూర్తిగా ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా నిర్ణీత గడువుతో పాటు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చెప్పారు. తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యే ప్రాజెక్టుల పనులను వేగంగా చేపట్టాలని సూచించారు. కృష్ణా […]
Fraud : హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చేతన్ జువెలర్స్ పేరుతో నగల వ్యాపారం నిర్వహిస్తున్న నితీష్ జైన్ అనే వ్యక్తి సుమారు రూ. 10 కోట్ల విలువైన బంగారం , ఆభరణాలతో పరారయ్యాడు. దీంతో మోసపోయిన కస్టమర్లు బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, నితీష్ జైన్ గత కొంతకాలంగా కస్టమర్ల నుండి బంగారాన్ని తీసుకుని ఆభరణాలు తయారు […]
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై అధికారులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్ ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్లో కాళేశ్వరం బయలుదేరుతారు. కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతీ పుష్కర ఉత్సవాల్లో సీఎం పాల్గొంటారు. సాయంత్రం 5.20 గంటలకు […]
సైన్యం భారీ ఆపరేషన్.. మణిపూర్‌లో 10 మంది ఉగ్రవాదులు హతం.. మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో బుధవారం అస్సాం రైఫిల్స్‌కు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర ఎన్కౌంటర్లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మయన్మార్ సరిహద్దులోని న్యూ సమతాల్ గ్రామం సమీపంలో ఉగ్రవాదుల కదలికలపై విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో సమాచారాన్ని పంచుకుంటూ.. భారత సైన్యం తూర్పు […]
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్ష సూచన జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణ విషయానికి వస్తే, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, , హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. Peddireddy […]
NTV Daily Astrology as on May 15th 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=TkZRwsEMtwM
Saraswati Pushkaralu : తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గురువారం తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ఆరంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించబడినాయి. మాధవానందుల ఆధ్వర్యంలో పుష్కరాల ప్రారంభ క్రతువు జరిగింది. ముందుగా కాళేశ్వరాలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ త్రివేణి సంగమానికి ఊరేగింపు జరిపారు. అనంతరం గణపతి పూజతో ప్రారంభమై, నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ చేశారు. నదీ మాతకు చీర, సారె, ఒడి బియ్యం, పూలు, పండ్లు […]
ఆ ఇద్దరు ఎంపీలు తమ నియోజకవర్గాల్లో అడుగు పెట్టాలంటే ఏంట్రీ పాస్ కావాల్సిందేనా? ఆ ఇద్దరు సీనియర్స్ ప్రమేయం లేకుండా ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేకపోతున్నారా? సీనియర్ మినిస్టర్స్ జూనియర్ ఎంపీలను తొక్కేస్తున్నారన్నది నిజమేనా? మరి ఎంపీలు కనీసం క్యాంప్ ఆఫీస్ ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? ఎవరా మంత్రులు, ఎంపీలు? జనం ఓట్లేసి గెలిపించారు. కానీ… ఇప్పుడు వాళ్ళకే దూరమైపోతున్నామంటూ తెగ ఫీలైపోతున్నారట నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నియోజకవర్గాల్లో అభివృద్ధి, […]
తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి అటా.. ఇటా..? ఎటు? ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్ధంగాని గందరగోళంలో ఉన్నారా? ఏంటి….? అసలేంటి… మాకీ ఖర్మ అంటూ పార్టీ నాయకులు తలలు బాదుకుంటున్నారా? అధికారంలో ఉన్న పార్టీ లీడర్స్‌కు అంత కష్టం ఏమొచ్చింది? క్రాస్‌రోడ్స్‌లో ఉన్నట్టుగా ఎందుకు ఫీలవుతున్నారు? పూటకో మాట, రోజుకో రూల్ అన్నట్టుగా ఉందట తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. వాళ్ళకు వాళ్ళే రూల్స్ పెట్టుకుంటారు. పాటించకుండా నీరుగార్చేది కూడా వాళ్ళే. ఈ క్రమంలో తాజాగా […]