HYD: నిండుకుండలా జంట జలాశయాలు..
- నిండుకుండలా జంట జలాశయాలు
- ఉస్మాన్ సాగర్‌లో నీటి మట్టం
- హిమాయత్ సాగర్‌లో వరద ప్రవాహం
- మరోసారి ఉదృతంగా మూసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD : హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జంట జలాశయాలను మరోసారి నింపేశాయి. ముఖ్యంగా వికారాబాద్, తాండూర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు వరద పోటెత్తింది. దీంతో ఇన్‌ఫ్లో భారీగా పెరగడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం (ఫుల్ ట్యాంక్ లెవెల్) 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1789.30 అడుగుల వరకు చేరింది. జలాశయానికి గంట గంటకూ వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం 1500 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా, అధికారులు నాలుగు గేట్లు 3 అడుగుల మేర ఎత్తి 1352 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
CP Radhakrishnan: నేడు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం.. ఎన్డీఏ నేతల హాజరు
Also Read
హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1763.15 అడుగులకు చేరింది. ఈ జలాశయానికి 5000 క్యూసెక్కుల వరద వస్తుండగా, అధికారులు రెండు గేట్లు నాలుగు అడుగుల మేర, మరో గేటు ఒక అడుగు మేర ఎత్తి మొత్తం 3600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. వరద ఉదృతి ఎక్కువగా కొనసాగుతుండటంతో అధికారులు శుక్రవారం ఉదయం ఆరు గంటలకు గేట్లను మరింతగా తెరిచి నీటి విడుదలను పెంచనున్నారు. ఉస్మాన్ సాగర్ నుండి 2400 క్యూసెక్కులు, హిమాయత్ సాగర్ నుండి 5600 క్యూసెక్కుల నీటిని ఒకేసారి వదిలే అవకాశం ఉందని సమాచారం.
ఈ నీరు మూసీ నదిలోకి చేరడంతో మరోసారి మూసి ఉదృతంగా ప్రవహించే అవకాశం ఉంది. జలాశయాలు నిండిపోవడం వల్ల హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నా, మూసి పరివాహక ప్రాంతాల్లో నివసించే వారికి అధికారులు అప్రమత్తం చేశారు. వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు అందిస్తున్నారు.
Vijayawada: అప్పటి నుంచే దేవి నవరాత్రులు ప్రారంభం.. ఏ రోజున ఏ అలంకారంలో దర్శనం ఇవ్వబోతున్నారంటే!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..