రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దూకుడుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
హైదరాబాద్ నగరంలో వందలాది పాత ఇళ్లు ఇంకా వాడుకలో ఉన్నాయి. ఈ ఇళ్లు వర్షాల కారణంగా కూలిపోయే ప్రమాదం ఉండటంతో, అక్కడ నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే తాత్కాలిక ఆశ్రయం కల్పించేలా పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో మునిగిపోకుండా అధికారులు ముందుగానే చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. ప్రమాదం తలెత్తే అవకాశమున్న ప్రాంతాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
Jagdeep Dhankhar: 2 నెలల తర్వాత రాష్ట్రపతి భవన్‌లో జగదీప్ ధన్‌ఖర్ ప్రత్యక్షం
హైదరాబాద్ నగరంలో వర్షాల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి GHMC, హైడ్రా, అగ్నిమాపక, SDRF, ట్రాఫిక్, పోలీసు విభాగాలన్నీ పరస్పరం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సీఎం ఆదేశించారు. ఏ ప్రాంతంలోనైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించేలా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాలైన వాగులు, చెరువులు, కుంటలు, కాజ్‌వేలు, కల్వర్టుల వద్ద నీటి ప్రవాహం పెరిగే అవకాశముందని అధికారులు గుర్తించారు. దీనిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా నీటి పారుదల శాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలని, గండిపడే చెరువులను అంచనా వేసి తక్షణం భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.
వర్షాల సమయంలో అవసరం లేని ప్రయాణాలను నివారించాలంటూ సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా తక్కువ బలమైన ఇళ్లలో, వాగు, చెరువు, నదుల పక్కన నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఆదేశాలతో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు ఇప్పటికే చర్యలు ముమ్మరం చేశారు. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది.
Congress Vs BJP: మోడీని తల్లి హెచ్చరిస్తున్నట్లు ఏఐ వీడియో విడుదల.. కాంగ్రెస్‌పై బీజేపీ ఆగ్రహం