నేడు ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం. ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం కార్యక్రమం. కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్, ఎన్డీఏ భాగస్వామ్యపక్ష నేతలు.
విశాఖ: ఏపీ లిక్కర్ కేసులో సుదీర్ఘంగా కొనసాగిన సిట్ తనిఖీలు.. నరెడ్డి సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో ముగిసిన సోదాలు. నిన్న ఉదయం 11 గంటల నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు కొనసాగిన సిట్ విచారణ.. హార్బర్ పార్క్ ఏరియాలోని వెర్టిలైన్, గ్రీన్ ఫ్యూయల్ సంస్థల కార్యాలయాల నుంచి హార్డ్ డిస్క్ లు, కీలక ఫైళ్లను ప్యాక్ చేసి విజయవాడ తరలించిన సిట్ బృందం..
భీమవరం: నేడు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ భీమవరంలో సారథ్యం పర్యటన. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తో పాటు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొంటారు.
విజయవాడ: పాత రాజరాజేశ్వరి పేటలో పెరుగుతున్న డయేరియా కేసులు. ఇప్పటివరకు 100 దాటిన డయేరియా బాధితుల సంఖ్య. నిన్న రాత్రి మెడికల్ క్యాంప్‌లో 30 మంది చికిత్స. మరికొందరు వైద్యానికి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తున్న బాధితులు. ఇప్పటికే పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరా నిలిపివేత.
తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయాయి.వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైనులో వేచివున్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,312 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 27,728 మంది భక్తులు. హుండీ ఆదాయం 3.81 కోట్లు.
తిరుపతి: నగరంలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన. హోటల్ తాజ్ లో రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్” కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో దంచికొట్టిన వాన. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. మెదక్ లో 19.8, రాజీపల్లి 15.9, కొల్చారంలో 9.9, పాతుర్ లో 9 సెంటిమీటర్ల అతి భారీ వర్షాలు. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట 16.4, నంగునూరు 13.6, చేర్యాలలో 11.7 సెంటిమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదు.
నిండుకుండలా జంట జలాశయాలు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మరో సారి నిండిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్.. వికారాబాద్, తాండూర్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద పోతేత్తిన ఇన్ ఫ్లో.. వరద ఉదృతి పెరగడంతో గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు.. ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1790 అడుగులు కాగా.. ప్రస్థాత నీటి మట్టం 1789.30.. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50 అడుగులు కాగా.. 1763.15 కు చేరిన నీటి మట్టం..
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం. రేపటి వరకు అల్పపీడనంగా మారే అవకాశం. నేడు, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు. 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్. తెలంగాణకు నాలుగు రోజలపాటు వర్ష సూచనన. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్లొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, నారాయణపేట, వనపర్తి, గద్వాల్ జిల్లాలో అక్కడకక్కడా భారీ వర్షాలు పడే అవకాశం.
వర్షాలపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. పురాతన ఇళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయించాలని, కాజ్‌వేలు, కల్వర్టుల దగ్గర అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇరిగేషన్ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి.