హుజురాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలకు 306 పోలింగ్ స్టేషన్లను ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఎన్నికల నిబంధనలు ఎవ్వరూ ఉల్లఘించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు 88 ఫిర్యాదులు అందినట్లు ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు డబ్బు, మద్యం పంపిణీ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతామని.. నిజాలు తేలితే ఎన్నికల అనంతరం కూడా […]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవలే పోస్ట్‌మెట్రిక్ స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్‌మెట్ దరఖాస్తు గడువు డిసెంబర్ 31వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే మరోసారి ఈ గడువును పెంచుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఈ పాస్ ద్వారా విద్యార్థులు జనవరి నెల చివరి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఇప్పటివరకు తక్కువ శాతంలో విద్యార్థులు స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకున్నారని.. అందుకే దరఖాస్తు గడువును […]
యావత్తు ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేసింది. కోవిడ్ కారణంగా ఎంతోమంది కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. దీంతో దేశాలు కోవిడ్ నివారణకు వ్యాక్సిన్ కనుగోన్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో వారివారి వ్యాక్సిన్లు ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ కరోనా మరోసారి విజృంభించింది. రోజురోజుకు అక్కడ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 84 శాతం ప్రజలకు 2 డోసులు పూర్తైనప్పటికీ కరోనా ప్రభావం తగ్గడం లేదు. దీంతో సింగపూర్ ప్రభుత్వం బూస్టర్ డోసులను కూడా ప్రజలకు […]
ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో నూతన గ్రామ కమిటీలను, మండల కమిటీలను టీఆర్ఎస్ నియమించింది. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా 9వ సారి కూడా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం కూడా హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. వచ్చే నెలలో వరంగల్‌లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానంటూ.. గతంలో సీఎం కేసీఆర్ […]
గత 5 నెలలుగా సాగిన ఉత్కంఠకు నేడు తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో టీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిననాటి నుంచి ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోపక్క టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హుజురాబాద్‌లో టీఆర్ఎస్ను గెలిపించేందుకు హుజురాబాద్ కేంద్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు […]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని కుప్పంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. కుప్పంలోని సామగుట్టపల్లెలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ సర్కార్‌పై పలు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రెండున్నర ఏళ్లుగా అభివృద్ధి ఆగిపోయిందని, రెస్కోను డిస్కంలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని వాటిని మేము అంగీకరించబోమన్నారు. అంతేకాకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ హయాంలో కట్టించిన ఇళ్లకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. స్థలం ఇవ్వలేదు, ఇల్లు కట్టలేదు కానీ […]
హుజురాబాద్ ఉప ఎన్నికకు ఈ రోజు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 306 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారనంటూ.. ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు పోలీసులు షాక్ […]
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకే మొదలైంది. ఉదయం పలు కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని హిమ్మత్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భార్య శ్వేత మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నాన్ లోక్సల్స్ ఎందుకు నియోజకవర్గంలో ఉన్నారంటూ, ఓటర్లను ప్రలోభ పెడుతోందంటూ తుల ఉమను గెల్లు శ్వేత […]
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 29న కుప్పంలో పర్యటించనున్నారు. గత పది రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాల దృష్యా కుప్పంలో చంద్రబాబు పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కుప్పంలో రెండు రోజులు పర్యటించనున్న చంద్రబాబు.. 29 కుప్పంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మరుసటి రోజు 30న కుప్పం పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తారు. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. కుప్పంలో టీడీపీ ఉనికి కొల్పొకుండా ఉండేందుకు గ్రామస్థాయి […]
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. లాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు కొనుగోలు చేయలేని పరిస్థితిలో చాలా మంది పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. అలాంటి వారికోసం గవర్నర్ తమిళసై ఓ అడుగు ముందుకువేసి నిరుపయోగంగా ఉన్న ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని ఐటీ కంపెనీలను, సంస్థలను ఆమె విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రాజ్‌భవన్‌లో దీని కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. […]