నేడు యూపీలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మీరట్‌లో మేజర్ ధ్యాన్‌చండ్ స్పోర్ట్స్ వర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు కేరళలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొచ్చిలో ఇంటిగ్రేషన్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంఘీభావంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నేడు కరీంనగర్‌లో జాగరణ దీక్ష చేపట్టనున్నారు. ఈ రోజు రాత్రి నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఈ జాగరణ దీక్ష కొనసాగనుంది.
హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,590లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,450లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,600లుగా ఉంది.