బద్వేల్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 7గంటలకు భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఉప ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. పోలింగ్ కు 72 గంటల ముందు నుంచే ఈ ప్రచారాలు ముగియడంతో మైకులు మూగబోయాయి. అయితే ఈ మేరకు జిల్లా కలెక్టర్ విజయరామారాజు, ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ.. బద్వేల్ నియోకవర్గంలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 281 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ పోలింగ్ […]
రోడ్డుపై వెళుతుంటే అనుకోకుండా చిన్నచిన్న జంతువుల మనకు తారసపడుతూనే ఉంటాయి. కానీ.. ఏకంగా ఓ మొసలి జాతీయ రహదారిపై కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఘటనే విజయనగరం రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని నెలివాడ చెరువు సమీపంలోని రోడ్డుపైన మొసలి ప్రత్యక్షమైంది. దీంతో ఆ మొసలిని గమనించిన వాహనదారులు రోడ్డుకు ఇరువైపులా ఆగిపోయారు. దాదాపు గంటసేపు మొసలి రోడ్డుపైనే ఉండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తరువాత మొసలి సమీపంలోని […]
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. గత నెల 28న హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిననాటి నుంచి నేటి వరకు కరీంనగర్ కమిషనరేట్, వరంగల్ కమిషనరేట్ సంబంధించి కమలాపూర్ మండల పరిధిలో ఎన్నికల దృష్ట్యా 10 చెక్ పోస్టులు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్, 5 ఏంసీసీ, 10 వీఎస్టీ లను ఏర్పాటు చేసి, పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నామని తెలిపారు. తనిఖీల్లో […]
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ లోక్సత్తా నేతపై దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. లోక్సత్తా పార్టీకి చెందిన వెంకటరమణ రాయదుర్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కంట్లో కారం కొట్టి కర్రలతో దాడికి యత్నించారు. దీంతో వెంకటరమణ తన వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ వైపు పరుగులు తీశారు. వెంకటరమణను దుండగులు ద్విచక్ర వాహనాలపై వెంబడించినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కు […]
హుజురాబాద్ ఉప ఎన్నికకు ఈ రోజు సాయంత్రంతో ప్రచార సమయం ముగియనుంది. దీంతో నాయకులు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. ఓటర్లను తిప్పుకునేందుకు చివరి ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీశ్రావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్లో ఓటమి ఖాయమని తెలిసి ప్రస్టేషన్తో కొంతమంది ఫోన్లు పగలకొడుతున్నారట అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు మాపై ఇచ్చిన ఫిర్యాదులతో మేము ఉన్న ఇండ్లను అధికారులు తనిఖీలు చేశారని ఆయన అన్నారు. మా ముఖ్యమంత్రి సభ పెట్టకుండా […]
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పెట్టుబుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ)తో ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. రాష్ట్రంలో భారీ పర్యాటక ప్రాజెక్టులపై బోర్టు సమావేశం నిర్వహించగా..పలు ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఒక్కో ప్రాజెక్టుపై కనీసం రూ.250 కోట్లు పెట్టుబడులు వస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా వివిధ ప్రాజెక్టులపై రూ.2,868.6 కోట్ల పెట్టుబడులు వస్తాయని తెలిపింది. ప్రాజెక్టుల ద్వారా ఐదేళ్లలో 1,564 గదుల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసువస్తామని తెలిపారు. ఓబెరాయ్ […]
పర్యాటకులకు మంత్రి అవంత శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. గత కొన్ని నెలల నుంచి నిలిచిపోయిన పాపికొండల బోటింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బుధవారం బోటు ఆపరేటర్లతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టూరిజం, నీటి పారుదల శాఖ అధికారులు, బోటు ఆపరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నవంబర్ 7 నుంచి పాపికొండల్లో బోటింగుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటకులకు బోట్లలో నిబంధనల ప్రకారం […]
ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఏడు గురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ మండలంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే వార్తలు రావడంతో స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. సుమారు రూ.3.5 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. దీంతో ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా పంచాయతీ అధికారిణిగా ఉన్న పార్వతిని సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కోన శశిధర్ […]
రోజురోజుకు ఏపీలో టీడీపీ, వైసీపీ నేల మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. సీఎం జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలతో ఏపీలో నిరసన జ్వాలలు చెలరేగాయి. అంతేకాకుండా గత పది రోజుల నుంచి వైసీపీ, టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. చంద్రబాబు టెర్రరిస్టు అంటూ ఇటీవల విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కౌంటర్ ఇచ్చారు. […]
హుజురాబాద్ ఉప ఎన్నికపై ఆ నియోజకవర్గ ప్రజలే కాదు.. యావత్తు రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోంది. భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో ఆత్మగౌరవం అంటూ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీలో చేరిన నాటి నుంచే ఈటల హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హుజురాబాద్లో టీఆర్ఎస్ […]