అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. న్యూఇయర్ వేడుకల్లో దుండగులు కాల్పుడు జరిపారు. న్యూఇయర్ వేడుకలకు వచ్చిన దుండగులు వేడుకలను మొదలైన కాసేపటికి కాల్పులు జరిపారు. ఒక్కసారి తుపాకీ పేలిన శబ్దం వినడంతో వేడుకల్లో ఉన్న జనం పరుగులు పెట్టారు. అమెరికాలోని మిసిసిపీ గల్ఫ్‌పోర్ట్‌లో నిర్వహించిన నూతన సంవత్సరం వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుల కాల్పుల్లో మగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాకుండా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాల్పుల్లో మరణించిన ముగ్గురిలో 11 ఏళ బాలుడు కూడా ఉండడంతో స్థానికంగా అందిరినీ కలిచివేసింది. ఈ ఘటనలో గాయపడిన వారిని హుటాహుటినా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే దుండగులు తప్పించుకున్నట్లు సమాచారం.