రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు ఆపాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏపీ సర్కార్ ఎయిడెడ్ స్కూళ్లను మూసివేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం విద్యను పేద విద్యార్థులకు అందకుండా ప్రతిపక్ష నేతలు ఏపీ ప్రభుత్వం మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన మంత్రి సురేస్ ఎయిడెడ్ స్కూళ్లను తాము ప్రక్షాళన చేస్తున్నామని వ్యాఖ్యానించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటినే మూసివేస్తున్నామని.. ప్రైవేటు విద్యకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనిని పక్కన […]
రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో ఆదివారం భూమి కంపించింది. భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. మంచిర్యాల జిల్లాలో వారం వ్యవధిలోనే భూమి కంపించడం ఇది రెండో సారి. దీంతో ఆ జిల్లా వాసులు భయాందోళనకుల గురవుతున్నారు. భూకంపం రావడంతో బోగ్గు గనుల్లో ఉన్న కార్మికులను ఖాళీ చేయించారు అధికారులు. వీటితో పాటు కరీంనగర్, వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించడంతో […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) సినిమాను ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచానాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గ్లింప్స్ శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా.. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో టీజర్ గ్లింప్స్ విడుదల ఆపేశారు. టీజర్ గ్లింప్స్ రిలీజ్ పై త్వరలోనే విడుదల చేస్తామని చెప్పిన చిత్రయూనిట్ రేపు 11 […]
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సభలో పాల్గొన్న పవన్ ఉక్కు పరిరక్షణ సమితికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. కేంద్రానికి ఇక్కడి సమస్యలు తెలియకుండా చేస్తున్నారని, ఇక్కడి మంత్రులు వెళ్లి కేంద్రానికి సమస్యలు వెల్లడించకుంటే కేంద్రానికి సమస్యలు ఎలా తెలుస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇక్కడి సమస్యలు కేంద్రానికి తెలియాలంటే […]
విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలవుదీరిన కనకదుర్గమ్మను దర్శించేందుకు వెళుతున్న భక్తులకు అధికారులు పలు సూచనలు చేశారు. ఇంద్రకీలాద్రి పలు ప్రాంతాల్లో పనులు చేపట్టనున్న నేపథ్యంలో.. ఘాట్‌రోడ్డుపై రాళ్లు జారిపడే అవకాశం ఉండటంతో కొండపైకి వచ్చే వాహనాలను ఆంక్షలు విధించారు. కొండపైకి వాహనాల్లో వెళ్లాలనుకునే భక్తులు అర్జున వీధి నుంచి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా మూడు రోజుల పాటు పనులు కొనసాగనున్న క్రమంలో ఘాట్ రోడ్డుపైకి వాహనాల అనుమతించబడవని అధికారులు వెల్లడించారు. అలాగే కార్తీకమాసం సందర్భంగా దీపావళి […]
వన్స్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అంటూ బాలయ్య ఓ సినిమాలు చెప్పిన డైలాగ్‌కు అనువధించినట్లుగానే ప్రస్తుతం యూట్యూబ్‌లో పరిస్థితి నెలకొంది. అదేంటీ అనుకుంటున్నారా.. అవునండీ.. ఓటీటీలో దూసుకుపోతున్న ఆహాలో నందమూరి బాలకృష్ణ (ఎన్బీకే) హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో నిర్వహించారు. ఈ షోకు సంబంధించిన ప్రొమోను ఇటీవల యూట్యూబ్‌లో ఆహా విడుదల చేసింది. దీంతో టీవీల్లో ఇంటర్య్వూలకే ఆసక్తి కనబరచని బాలయ్య ఏకంగా హోస్ట్ చేస్తున్నారా..? ఎలా ఉందో చూడాలి మరీ..? అంటూనే చూసేస్తున్నారు. […]
విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పోరాటం చేస్తోంది. వారికి సంఘీభావం తెలిపేందుకు విశాఖకు చేరుకున్న పవన్.. కూర్మన్నపాలెం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంతో విన్నవించి విశాఖ ప్రైవేటీకరణను ఆపాలని కోరారు. అవసరమైతే సీఎం జగన్ అఖిలపక్షాన్ని పిలవండి అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రతి యువకుడు జైతెలంగాణ […]
కామారెడ్డిలో ఓ వివాహత అనుమానస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిప్రసాద్, శిరీష(32)లు దంపతులు. బెంగూళూరులోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో వీరిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో గత కొంతకాలంగా ఇంటినుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం శిరీష ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని భర్త హరిప్రసాద్ శిరీష తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకున్న శిరీష తల్లిదండ్రులు హరిప్రసాదే శిరీషను హత్యచేసి ఆత్మహత్యగా […]
ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ఓవైపు బీజేపీ, మరో వైపు కాంగ్రెస్ లతో పాటు ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పకునేందకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఒకరిపైఒకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ, బీఎస్పీ నేతలు కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందాలతో గోరఖ్‌పూర్ ఎన్నికల్లో పాల్గొంటున్నారని అన్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. ‘మేం చావనైనా చస్తాం..కానీ.. బీజేపీతో పొత్తు పెట్టుకోం’ అంటూ తీవ్రంగా […]
ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన బద్వేల్ ఉప ఎన్నికకు పోలింగ్ నిన్న ప్రశాంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల స్వల్ప ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ నేతలు దొంగఓట్లు వేయించారని ఆరోపించారు. అంతేకాకుండా 28 చోట్ల రెగ్గింగ్ జరిగిందని, వివిధ ప్రాంతాల నుంచి జనాలను తీసుకువచ్చి దొంగఓట్లు వేయించారని అందుకే ఓటింగ్ శాతం కూడా పెరిగిందన్నారు. అధికారంలో వైసీపీ పార్టీ బద్వేల్లో ఓడిపోతామని తెలిసే […]