జగన్ సర్కార్ ఆధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో అమరావతి అభివృద్ధికి భూములిచ్చి రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 45 రోజుల మహా పాదయాత్రకు రాజధాని రైతులు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్ర నవంబర్ 1 నుంచి ప్రారంభమైంది. నేడు రెండవ రోజు పాదయాత్రను ప్రారంభించనున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తాడికొండ నుండి గుంటూరు శివారు ప్రాంతం వరకు 12.6 కిలో మీటర్ల […]
గత 5 నెలల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఉప ఎన్నికల నోటిషికేషన్ వచ్చిననాటి నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి ప్రజలను ఎంతవరకు ఒప్పించారనేది ఈ రోజుతో తేలనుంది. ఓటర్లు మెచ్చిన లీడర్ ఎవరో నేటి ఓట్ల లెక్కింపుతో బయట పడనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుకు కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం ఈవీఏంలను కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీలోనే ఏర్పాటు చేసిన […]
మేషం :- ఉద్యోగస్తులు శ్రమ, పనితనాన్ని అధికారులు గుర్తిస్తారు. పాత లక్ష్యాలు నెరవేరుతాయి. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. ఇచ్చుపుచ్చుకునే విషయాల్లో ఖచ్చితంగా వ్యవహరించండి. ఆత్మీయుల కలయిక వల్ల మానసికంగా కుదుటపడతారు. రావలసిన ధనం చేతికందడంతో పొదుపు పథకాల వైపు దృష్టి మళ్లిస్తారు. వృషభం :- వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. చేపట్టిన పనులు అర్థాంతరంగా ముగించాల్సి వస్తుంది. పరిచయాలు సంతృప్తినిస్తాయి. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ఖర్చులు అంచనాలు […]
ఇటీవలే ఓ దుర్మార్గుడు రూ.100 కోసం బాలుడి ప్రాణాలను గాలిలో కలిపేసిన ఘటన నిలోఫర్ ఆసుప్రతిలో చోటు చేసుకుంది. అయితే నిలోఫర్ లో బాలుడి మరణం పై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆలస్యంగా స్పందించారు. ఘటన పై సీనియర్ డాక్టర్ల తో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. అనుమానితుడిని చర్యలు తీసుకున్నామని సూపరింటెండెంట్ వెల్లడిస్తున్నారు. ఘటనకు బాధ్యుడైన వ్యక్తి పేరును బయటపెట్టకపోవడంతో నీలోఫర్ అడ్మినిస్ట్రేషన్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కింది స్థాయి సిబ్బందితో నిలోఫర్ వైద్య అధికారులు […]
టీకాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటి నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సభ్యత్వం ఇవ్వడం అంటే.. కాంగ్రెస్ కుటుంబంలో సభ్యుడు కావడమేనని అభివర్ణించారు. సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వాళ్లంతా సోనియా గాంధీ కుటుంబ సభ్యులని, చిల్లర మల్లరా పార్టీలకు మనకు పోటీ కాదని అన్నారు. దేశ ప్రజల బానిస సంకెళ్లు తెంచిన పార్టీ కాంగ్రెస్ అని, దేశం […]
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మార్గదర్శిని ఎంచుకుందని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు.. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి ఆర్టీసీని ముందుకు తీసుకువెళ్లేందుకు వినూత్న రీతిలో నిర్ణయాలు తీసుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. తాజాగా మరో నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే బాలింతలు రద్దీగా ఉండే బస్టాండ్‌లో పసిపిల్లలకు పాలిచ్చేందుకు అనుగుణంగా ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని […]
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో పండిన పంటను, ఒక గింజ కూడా కొనలేము అని ఎఫ్‌సీఐ, కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన సహకారం రావడం లేదని, ఎఫ్‌సీఐ ఎప్పటికప్పుడు వడ్లు తీసుకోకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఢిల్లీలోని ప్రభుత్వం వడ్ల కొనుగోలు పై మొండివైఖరి […]
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటుకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి అభివృద్ధికి తమ భూములు ఇచ్చిన రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి 45 రోజుల పాటు మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలిపారు. అంతేకాకుండా రాజధాని అమరావతిని కాపాడుకోవాలని ఆకాంక్షిస్తున్నవారు రైతుల మహాపాదయాత్రకు మద్దతుగా నిలువాలన్నారు. రాజధానికి కాపాడుకోకపోతే రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో […]
ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్మారకార్థం అవార్డులు ప్రధానత్సవ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుజాతి తరఫున అందరికి శుభాకాంక్షలు.. కేంద్రం పద్మ అవార్డులను, భారతరత్న వంటి అవార్డులతో సత్కరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి అవార్డులు ఇవ్వాలని వైఎస్ఆర్ అవార్డులు ఇస్తున్నాం’ అని అన్నారు. ‘నిండైన తెలుగుదనం నాన్నగారి పంచెకట్టులో కనిపిస్తుంది. ఆకాశమంత ఎత్తు ఎదిగిన ఆ మహామనిషి […]
తెలంగాణలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రత గత రెండు,మూడు రోజుల నుంచి అధికమవడంతో తెల్లవారుజామున ఇంటినుంచి బయటకు రావాలంటే స్వేటర్ లేకుండా సాధ్యంకాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లోనైతే ఏకంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 12గా నమోదయ్యాయి. చలికాలం మొదట్లోనే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో చలి తీవ్రత ఏవిధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ విడుదల చేసిన ఉష్ణోగ్రతల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో భీంపూర్‌లో 12.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు […]