గత రెండు సంవత్సరాలుగా ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పటికీ వీడనంటోంది. కరోనా డెల్టా వేరియంట్‌తోనే సతమతమవుతుంటే తాజాగా మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. అయితే తాజాగా ఏపీలో 15,568 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 122 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అంతేకాకుండా గడచిన 24 గంటల్లో 103 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు, ఒకరు కరోనా బారినపడి మరణించినట్లు వైద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
అయితే మొత్తం ఇప్పటివరకు 20,77,608 మందికి కరోనా రాగా, ఇప్పటివరకు 20,61,832 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 14,498 మంది కరోనా బారినపడి మృతి చెందారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఏపీలోకి ప్రవేశించిన కరోనా కొత్త వేరియంట్ కూడా ఏపీలో వ్యాప్తి చెందుతోంది. దీంతో కోవిడ్ ఆంక్షలు ప్రభుత్వం తప్పనిసరి చేసింది.