నిన్న కరీంనగర్‌లోని బీజేపీ క్యాంపు ఆఫీసులో బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ ఘటనపై స్పందిస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. నిన్న రాత్రి బండి సంజయ్ అరెస్ట్ దర్మార్గమపు చర్య అని ఆయన అన్నారు. విపత్తు చట్టం విపక్షాలకే వర్తిస్తుందా.. కేసీఆర్ కుటుంబానికి వర్తించదా అని ఆయన ప్రశ్నించారు.
అంతేకాకుండా నిన్న బీజేపీ కార్యాలయంలో కట్టర్‌లను వినియోగించి గేట్లను తెరిచారని ఇది పోలీసు వ్యవస్థకే మాయని మచ్చని ఆయన అన్నారు. పోలీసులు ఆత్మపరిశీలన చేసుకోవాలని, చట్టం కొందరికే చుట్టంలా ఉండకూడదని ఆయన అన్నారు. ఓ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడిపై ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు చేసే హక్కు అందరికీ ఉందన్నారు. చేతనైతే సమాధానం చెప్పాలని కాని ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు.