ఓ రిటైర్డ్ ఉద్యోగి చెన్నైలో ఉంటున్న కొడుకు దగ్గరకు వెళ్లి వచ్చే సరికి దొంగలు ఇల్లు కొల్లగొట్టిన ఘటన శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తకోనేరు వీధికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి చెన్నైలో ఉన్న తన కొడుకు ఇంటికి తన భార్యతో కలిసి డిసెంబర్ 31న వెళ్లాడు. అయితే చెన్నై నుంచి తిరిగి రావడానికి ఇంటిలో వున్నకారు తీసుకొనిరా అని డ్రైవర్ ను పురామాయించాడు.
దీంతో కారుకోసం ఇంటిదగ్గరకు వెళ్లగా అక్కడి ఇంటి తలుపు తెరిచి ఉండటాన్ని గమనించిన డ్రైవర్ రిటైర్డ్ ఉద్యోగికి సమాచారం అందించాడు. అంతేకాకుండా పోలీసులు సమాచారం చేరవేశాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 18 తులాల బంగారం, 2.65 లక్షల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.