ఈ నెల 2వ తేదీన కరీంనగర్‌లో బీజేపీ చీప్ బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను భగ్నం చేసి పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బండి అరెస్ట్‌ను ఖండిస్తూ జాతీయ స్థాయి నేతలు తెలంగాణకు వచ్చారు. అయితే నిన్న బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ బీజేపీ నేతలతో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడారు.
సంజయ్ అరెస్ట్ తర్వాత జాతీయ నేతలు ఇక్కడకు రావడం అంటే బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై ఎంత సీరియస్ గా ఉందొ అర్థం చేసుకోండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పై పోరును కొనసాగించండి.. మమస్ఫూర్తిగా పోరాడండి అంటూ ఆయన బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టికెట్స్ కోసం కాకుండా ప్రజల మధ్య ఉండండి, ప్రజా సమస్యల పై పోరాడండి అని ఆయన సూచించారు. అంతేకాకుండా బండి సంజయ్‌ని ప్రత్యేకంగా జేపీ నడ్డా అభినందించారు.