నేడు భారత్-చైనా 14వ రౌండ్ కమాండర్ స్థాయి చర్చలు జరుగనున్నాయి. చుషుల్-మాల్దో ప్రాంతంలో ఉదయం 9.30 గంటలకు సమావేశం జరుగనుంది.
ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలోని రామాలయంలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. కరోనా కారణంగా ఆలయంలోనే కొలను ఏర్పాటు చేసి తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అంతేకాకుండా తెప్పోత్సవం కార్యక్రమానికి భక్తులకు అనుమతి నిరాకరించారు.
నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ విద్యానగర్‌లో ఐటీసీకి చెందిన వెల్కమ్ హోటల్‌ను ప్రారంభించనున్నారు.
నేడు తమిళనాడులో 11 నూతన వైద్య కాలేజీలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. వర్చువల్ విధానంలో ప్రధాని మోడీ ఈ వైద్య కాలేజీలను ప్రారంభించనున్నారు.
విభజన సమస్యలపై ఇవాళ కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ, ఏపీ సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వర్చువల్‌గా సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 9 అంశాలపై హోంశాఖ కార్యదర్శి చర్చించనున్నారు.
ప్రధాని మోడీ పంజాబ్ పర్యటన భద్రతాలోపం కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీర్పును వెలువరించనుంది.
నేడు తెలంగాణ బీజేపీ కార్యాలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఈ వైద్య శిబిరంకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హజరుకానున్నారు.
నేడు ట్యాంక్‌బండ్‌పై బీజేపీ మానవహారం కార్యక్రమం నిర్వహించనుంది. అయితే ఈ మానవహారంలో బీజేపీ నేతలు కె.లక్ష్మన్‌తో పాటు ఆలె భాస్కర్‌లు పాల్గొననున్నారు.