ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18న ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో మొదటి ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. కానీ టీడీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని కోరడంతో దానిపై వైసీపీ సర్కార్ కూడా సానుకూలంగా స్పందించింది. అయితే రెండవ రోజు ఉద్రిక్తతల నడుమ సాగిన అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. తాజాగా ఏపీ కేబినెట్ అత్యవసరంగా సమావేశం నిర్వహించనుంది. […]
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తిటీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం వేడుకలు తుది దశకు చేరుకున్నాయి. నవంబర్ 12న ప్రారంభమైన ఈ వేడుకలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ కోటి దీపోత్సవ వేడుకలు ఆరంభం నుంచి వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. నేడు కార్తిక సోమవారాన్ని పురస్కరించుకొని కోటి దీపోత్సవ వేడుకల్లో 11వ రోజు సందర్భంగా విశేషాలు చూద్దాం.. ముందుగా శ్రీశ్రీ రవిశంకర్ గూరూజీచే అనుగ్రహ భాషణం. అనంతరం శ్రీనండూరి శ్రీనివాస్‌చే ప్రవచనామృతం నిర్వహించనున్నారు. […]
భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమైంది. మునెపెన్నడూ చూడని విధంగా ఏపీలో వరదలు పోటెత్తాయి. వరద ప్రభావంతో గ్రామాలు జలదిగ్బంధంలో ఇరుకున్నాయి. లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వేలాదిగా పశువులు వరదల్లో కొట్టుకుపోయాయి. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల్లోని ప్రజలు భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తిరుపతిలో కనివిని ఎరుగని రీతిలో భారీ వర్షాలు సంభవించాయి. అయితే సీఎం జగన్ […]
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండగా మారి ఏపీలో విజృంభించింది. దీంతో ఏపీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పటికే భారీ వర్షాలకు 28 మంది మృతి చెందగా, 17 మంది గల్లంతయ్యారు. గల్లంతైనవారికోసం అధికారులు గాలింపుచర్యలు చేపట్టారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులకు గండ్లు పడడంతో వరద నీరు గ్రామాల్లోకి చేరింది. 1,316 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. 6.33 లక్షల ఎకరాల్లో పంట నష్టం […]
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలితో మందుకు వెళుతున్నారు ఎంకే స్టాలిన్. మొన్నటి వరకు ఆయన చేసిన పనులకు నీరాజనం పట్టిన ప్రజలు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి తమిళనాడుపై ప్రభావం చూపింది. భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలమైంది. అయితే ఈ నేపథ్యంలో వరదలు సంభవించాయి. దీంతో వరదలను ఎదుర్కొవడంలో ఎంకే స్టాలిన్ ప్రభుత్వం విఫలమైందంటూ ట్విట్టర్ వేదికగా గోబ్యాక్‌స్టాలిన్ హ్యాష్‌ట్యాగ్‌తో విమర్శలు […]
ఈ నెల 18న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభలో తనను వ్యక్తిగతంగా దూషించారని చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి హోదాలోనే సభలో అడుగుపెడుతానంటూ శపథం చేశారు. అనంతరం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం 9 గంటలకు మూడోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.ఇవాళ్టి నుంచి ప్రశ్నోత్తరాల సమయాన్ని అసెంబ్లీ చేపట్టనుంది. సభ ముందుకు ఏపీ ఉద్యాన నర్సరీల రిజిస్ట్రేషన్ […]
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి తమిళనాడుతో పాటు ఏపీపై విరుచుకుపడింది. ఇప్పటికే వాగులు, వంకలు పొంగి వరదలు సంభవించాయి. చెరువులకు గండ్లుపడి గ్రామాల్లోకి నీరు చేరుతోంది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. కొన్ని గ్రామాలు వరద నీటి దిగ్బంధంలో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. ఈ భారీ వర్షాలతోనే ఏపీ అతలాకుతలం అవుతున్న వేళ మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. Read Also : What’s […]
ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్ర ప్రారంభించారు. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ రాజధాని రైతులు ప్రారంభించిన ఈ పాదయాత్రం 45 రోజుల పాటు సాగనుంది. అయితే డిసెంబర్ 15నున తిరుమలకు ఈ పాదయాత్ర చేరుకునే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఏపీలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడి వరదలు బీభత్స సృష్టించాయి. కొన్ని గ్రామాల వరద నీటితో జలదిగ్బంధంలో చిక్కుకోవడం అధికారులు సహాయక చర్యలు […]
నేడు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగనుంది. 12 పురపాలక, నగర పంచాయతీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. వర్షాల ప్రభావంతో నేడు పలు రైళ్లు రద్దు, దారి మళ్లిస్తున్నట్లు దక్షిన మధ్య రైల్వే శాఖ పేర్కొంది. విశాఖపట్నం-కడప (17488), తిరుపతి-భువనేశ్వర్ (22872)రైలు రద్దు, బిట్రగుంట-చెన్నై సెంట్రల్ (17237), చెన్నై సెంట్రల్-బిట్రగుంట (17238), చెన్నై […]
మోసగాళ్లు రోజురోజుకు మితిమీరి పోతున్నారు. కొత్త కొత్త పంథాలతో అమాయకులను టార్గెట్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ ఓ కేటుగాడి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్‌కు చెందిన జేసీబీ, ట్రాక్టర్ల యాజమానులకు ప్రభుత్వం కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నమ్మబలికాడు. దీంతో సదరు వ్యక్తి మాటలు నమ్మిన జేసీబీ, ట్రాక్టర్ల యాజమానులు ముడుపులు ముట్టజెప్పారు. ఇంకేముంది.. ఆ ముడుపులు తీసుకు ఆ కేటుగాడు పరారయ్యాడు. దీంతో మోసపోయామని తెలిసిన జేసీబీ, ట్రాక్టర్ల యజమానులు మహబూబాబాద్ […]