US-Iran: యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నుంచి దాడులు.. ఖమేనీ లక్ష్యంగా క్షిపణులు ప్రయోగం
- ఇరాన్‌పై యుద్ధం మొదలుపెట్టిన అమెరికా, ఇజ్రాయెల్
- టెహ్రాన్ అంతటా క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరు దేశాలు
- యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నుంచి దాడులు
- ఖమేనీ లక్ష్యంగా క్షిపణులు ప్రయోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెదిరించినట్టుగానే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టాయి. శనివారం ఇరాన్‌పై భీకర దాడులకు దిగాయి. టెహ్రాన్‌లో అధ్యక్షుడి కార్యాలయం సహా ఇరాన్ వైమానిక స్థావరాలు లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు ప్రారంభించాయి. అరేబియా సముద్రంలో మోహరించిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక నుంచి క్షిపణులు దూసుకుపోయాయి. దీంతో టెహ్రాన్‌లో అనేక చోట్ల భారీ ఎత్తున పేలుళ్లు సంభవించాయి. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Iran-Israel: ఇరాన్‌పై మొదలైన యుద్ధం.. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు
Also Read
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
ఇదిలా ఉంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అధ్యక్షుడి కార్యాలయంపై క్షిపణులు విరుచుకుపడ్డాయని ఇరాన్ టీవీ ఛానల్స్ వెళ్లడించాయి. ఇక వైమానిక స్థావరాలపై దాడి చేయడంతో అనేక మంది సైనికులు కూడా మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని కార్యాలయం సమీపంలో క్షిపణి దాడి జరిగింది. ఖమేనీ ఇల్లు, హెడ్ క్వార్టర్స్, రక్షణశాఖ, ఇంటెలిజెన్స్ శాఖ ఆఫీసు సమీపంలో కూడా దాడులు జరిగాయి. దాడులకు ముందే ఖమేనీ బంకర్‌లోకి వెళ్లిపోయారు.

ఇదిలా ఉంటే అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ స్పందించింది. యుద్ధం వారు ప్రారంభించారు. ముగింపు మేము ముగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ప్రతీకార దాడులకు ఇరాన్ సిద్ధపడుతోంది. ఈ నేపథ్యంలో టెల్ అవీవ్‌లో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

Multiple explosions take place in Tehran pic.twitter.com/pgDjsWPJFt
— Press TV 🔻 (@PressTV) February 28, 2026
తాజావార్తలు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
-
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..