సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంత్రి కొడాలి నానికి చెందిన కల్యాణ మండపంలో క్యాసినో, పేకాట, జూదం అంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో నేడు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ కృష్ణ జిల్లా లోని కొడాలి నాని కల్యాణ మండపానికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్బంగా టీడీపీ నేత బోండా ఉమ మాట్లాడుతూ.. గుడివాడలో గత కొంత కాలంగా క్యాసినో, పేకాట, జూదం నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ఎస్పీకి ఆధారాలతో ఫిర్యాదు చేశామని, నిజ నిర్దారణ బృందం వెళితే ఎందుకు అడ్డుకున్నారని ఆయన అన్నారు. నా కారు పై దాడి చేసి పగల గొట్టారని, కొడాలి నాని నీవు దొరికిన దొంగవి అని విమర్శించారు.
ఏమి జరగక పోతే.. మా బృందానికి స్వాగతం పలికి ..కన్వెన్షన్ లో ఏమి జరగలేదని చూపించాల్సింది. కొడాలి నాని ని రక్షించడానికి డీజీపీ రంగంలోకి దిగాడు. ముఖ్యమంత్రి కొడాలి నాని ని ఎందుకు బర్తరఫ్ చేయలేదు. మీ తప్పులు ఎత్తి చూపితే మాపై దాడులు చేస్తారా. డీజీపీ అధికార పార్టీ కార్యకర్తలా వ్యవవహరిస్తున్నారు.. ఏమి సమాధానం చెబుతావు అని ఆయన ధ్వజమెత్తారు. మా పై దాడి ఘటన పై పామర్రు పోలీసులకు పిర్యాదు చేసామని, మాపై హత్యాయత్నం చేశారని, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. క్యాసినో నిర్వహించిన కొడాలి నాని పై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయస్థానానికి వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.