ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన ప్రకటించిన పీఆర్సీ ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని.. తమ సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని కోరుతూ మళ్లీ సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ లోని సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతల భేటీ అయ్యారు. పీఆర్సీ సాధనా సమితి పేరుతో ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఎన్జీవో హోంలో సమావేశానికి కొనసాగింపుగా అప్సా కార్యాలయంలో నేతల సమావేశం నిర్వహించారు.
సంప్రదింపుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విషయంలో ఏవిధమైన వైఖరితో ఉండాలనే అంశం పైనా చర్చించనున్నారు. సమావేశం అనంతరం సీఎస్ ను పీఆర్సీ సాధనా సమితి నేతలు కలువనున్నారు. పాత జీతాలనే చెల్లించే విధంగా నిర్ణయం మార్చుకోవాలని నేతలు కోరనున్నారు. ట్రెజరీ ఉద్యోగుల పై ప్రభుత్వం ఒత్తిడి తేవడం సమంజసం కాదని సీఎస్ కు నేతలు స్పష్టం చేయనున్నారు.