ఐసెట్ చివరి విడత కౌన్సిలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కొత్తగా కౌన్సిలింగ్లో పాల్గొనే విద్యార్థులు నేడు స్లాట్ బుక్ చేసుకోవాలని కన్వీనర్ మిత్తల్ నవీన్ కోరారు. రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. రేపు, ఎల్లుండి వెబ్ అప్షన్లకు అవకాశం ఉందని తెలిపారు. చంద్రబాబు కుటుంబం పట్ల అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా మౌన ప్రదర్శనలు, దీక్షలు చేపట్టాని పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేడు టీడీపీ శ్రేణులు […]
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏపీలో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరుపతిలో మునుపెన్నడూ చూడన విధంగా వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు వరదల కారణంగా కొండచరియలు విరిగి ఘాట్ రోడ్డుపై పడిపోయాయి. అంతేకాకుండా మెట్టుమార్గంలో చెట్లు, వరద నీటితో అస్థవ్యస్థంగా తయారైంది. దీంతో ఘాట్ రోడ్డుపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే… తాజాగా వర్షం తగ్గుముఖం పట్టిన నేపథ్యంతో తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి […]
కార్తికమాసాన ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్తిటీవీ నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. నవంబర్ 12వ తేదీన ప్రారంభమైన ఈ వేడుకలు 22న ముగియనున్నాయి. నేడు 10వ రోజును పురస్కరించుకొని విశేషాలను చూద్దాం.. విశాఖపట్నం శారదా పీఠం శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి వార్లచే అనుగ్రహ భాషణం. బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మచే ప్రవచనామృతం. అనంతరం ఏడుకొండల్లో కొలువుదీరిన కోనేటి రాయుడు తిరుమల శ్రీనివాస కల్యాణోత్సవం నేత్రపర్వంగా జరుగనుంది. ఆ తరువాత భక్తులను […]
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఏపీలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అంతేకాకుండా చెరువులు, కుంటలు నిండి కట్టలు తెగిపోతున్నాయి. దీంతో వరద నీరు గ్రామాల్లోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కొన్న చోట్ల చెరువులు నిండుకుండాలను తలపిస్తుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తోందోనని ప్రజలు బిక్కబిక్కుమంటూ భయాందోళనలో ఉన్నారు. అనంతరపురం కురిసిన భారీ వర్షాలకు హిందుపురంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో హిందుపురం నుంచి అనంతపురం, పెనుకొండ, గోరంట్ల, లేపాక్షి, చిలమత్తారు గ్రామాలకు రాకపోకలు […]
టీడీపీ నేత కూన రవికుమార్‌ను అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులను దుర్భషలాడారనే ఆరోపణతో కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అర్థరాత్రి శ్రీకాకుళం జిల్లా శాంతినగర్‌లోని తన అన్నయ్య ఇంట్లో కూన రవికుమార్ నిద్రిస్తున్నారు. Also Read:10వ రోజు : కోటి దీపోత్సవంలో.. కోనేటి రాయుడి కల్యాణం.. ఆ సమయంలో పోలీసులు భయబ్రాంతులకు గురి చేసి, గది తలుపులు తొలగించి మరీ తన తమ్ముడిని అరెస్ట్ చేశారని కూన […]
ఏపీలో నిరసన జ్వాలలు చెలరేగాయి. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత తనను వ్యక్తిగతంగా దూషించారని ఆరోపిస్తూ సభను బయటకు వచ్చేశారు. అనంతరం తన ఛాంబర్ టీడీఎల్సీ సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో ముచ్చటిస్తూనే కన్నీటి పర్యంతమయ్యారు. తమ అభిమాన నేత ఇలా కన్నీరు పెట్టుకోవడాన్ని చూసిన టీడీపీ శ్రేణులను ఆవేదన గురి చేసింది. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో టీడీపీ శ్రేణులు నిరసన, ఆందోళనకు దిగారు. […]
గత కొన్ని రోజుల క్రితం ఇంట్లో కాలు జారిపడి సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ సికింద్రాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . అయితే తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 1959లో సిపాయి కూతరు సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆయన మొన్న వచ్చిన అరుంధతి సినిమా వరకు వివిధ పాత్రల్లో నటించిన ప్రేక్షకులను మెప్పించారు. ఆయన నటనకు ‘నవరసనటనా సార్వభౌమ’ ‘కళా ప్రపూర్ణ’ ‘నటశేఖర’ లాంటి బిరుదులు వరించాయి. ఆయన ఇప్పటివరకు […]
ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని, నా భార్య శీలాన్ని కించపరిచేవిధంగా మాట్లాడుతున్నారంటూ సభలోంచి వెళ్లిపోయారు. అంతేకాకుండా మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడుతానంటూ శపథం చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరుపెట్టుకున్నారు. అప్పటినుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనజ్వాలలు రగులుతున్నాయి. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణ నేతృత్వంలో […]
నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పరిణామాలపై నందమూరి బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబులాంటి వారిని దూషించడం చాలా బాధకరమైన విషయమని.. అందులో మా సోదరి భువనేశ్వరీని తీసుకురావడం హేయమైన చర్యని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతలు మాట్లాడే భాష చూస్తే కూడా అసహ్యం వేస్తోందన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన చోట క్యారెక్టర్ అస్సాసియేషన్ మంచిది కాదన్నారు. అసెంబ్లీ వాగ్వాదాలు మామూలే కాని వ్యక్తిగత […]
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాల 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులతో సీఎం కేసీఆర్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. 12 మందిలో కొందరు అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నెల 23 నామినేషన్ కు ఆఖరు తేదీగా […]