గుడివాడలో సంక్రాంతి పండుగ రోజున మంత్రి కొడాలి నాని కి చెందిన కల్యాణ మండపంలో క్యాసినో నిర్వహించారని, టీడీపీ నిజ నిర్దారణ కమిటీ ఈ ఘటనపై వాస్తవాలను బయటపెట్టేందుకు వెళ్లగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. నిజ నిర్దారణకు వచ్చిన తమపై దాడి పోలీసులు పట్టించుకోలేదని, డీజీపీ పనికి మాలిన వాడంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.
వర్ల రామయ్య వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్ అయింది. డీజీపీ పై వర్ల, ఇతర నాయకులు చేసిన వ్యాఖ్యలను ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. రాజకీయ ప్రయోజనాల కోసం అధికారుల పై ఆరోపణలు చేసి దూషించడం మానుకోవాలని పలికిన ఐపీఎస్ అధికారులు సంఘం హితవు పలికింది. ఇదే వ్యవహారాల శైలి కొనసాగితే చట్టపరమైన తీసుకుంటామని ఐపీఎస్ అధికారులు సంఘం జాయింట్ సెక్రటరీ రాజీవ్ కుమార్ మీనా హెచ్చరించారు.