ధాన్యం కొనుగోలు విషయమై నేడు సీఎం కేసీఆర్ ఢిల్లీలో మూడో రోజు పర్యటించనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని ప్రకటించడంతో సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారుల బృందంతో ఢిల్లీకి వెళ్లారు. భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ప్రకారం నేటితో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటికీ టీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులు కూడా వారివారి నామినేషన్లను సమర్పించారు. వాయుగుండం ప్రభావంతో ఏపీలో […]
ఏపీలో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఏపీలో కురిసిన భారీ వర్షాలపై మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయని, చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉందన్నారు. వరదలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. సీఎం జగన్ ఎప్పటికప్పుడు అధికారులకు ప్రత్యేక సూచనలు చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు వరదల్లో 34 మంది మృతి చెందారని, 10 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. మృతి చెందిన […]
ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ కలెక్టరేట్ లో ఈ ఎన్నిక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు ఈ రోజు నామినేషన్లు అందించారు. కాగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా, పోచంపల్లి తరపున మరో రెండు నామినేషన్లు పడ్డాయి. మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి ఒక సెట్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే […]
ఏపీలో 3 రాజధానుల అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. జగన్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. దీంతో హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పలు అంశాలపై ప్రభుత్వంపై ప్రశ్నలు గుప్పించింది. అంతేకాకుండా నేటికి విచారణను వాయిదా వేసింది. దీంతో నేడు విచారణకు హజరైన అడ్వకేట్ జనరల్ 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ఉన్నత న్యాయస్థానానికి వెల్లడించారు. ఈ విషయంపై అత్యవసరంగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో చర్చించి 3 […]
3 రాజధానుల అంశం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో మూడు రాజధానులు చేస్తామంటూ జగన్ సర్కార్ ప్రకటించడంతో పాటు అసెంబ్లీలో చట్టం చేసింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలవడంతో హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరుపున హజరైన అడ్వకేట్ జనరల్ 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటునట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయ పరిణామాల్లో మార్పు చోటు చేసుకుంది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. […]
2019 ఫిబ్రవరి 27న జరిగిన వైమానిక పోరాటంలో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినందుకు వింగ్ కమాండర్ (ప్రస్తుతం గ్రూప్ కెప్టెన్) అభినందన్ వర్థమాన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీర చక్ర అవార్డును ప్రదానం చేశారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. అయితే పాకిస్థాన్ సైతం ఎంతో అత్యాధునికమైన ఎఫ్-16 ఫైటర్ జెట్స్‌ను కదన రంగంలోకి దించింది. దీంతో మిగ్-21 యుద్ద […]
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూడు రాజధానుల అంశం నేడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మూడు రాజధానుల అంశాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అవడంతో హైకోర్టు విచారణ చేపట్టింది. మూడు రాజధానుల అంశంపై వాదోపవాదాలు విన్న హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ రోజు మళ్లీ హైకోర్టు ఈ విషయంపై విచారణ చేపట్టడంతో మూడు రాజధానులు అంశాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. దీనిపై అసెంబ్లీలో కూడా […]
అమరావతి రైతులు, ఏపీకి ఒకే రాజధానికి మద్దతిస్తున్న వారికి జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మూడు రాజధానులపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉప సంహరించుకున్నట్లు అడ్వకేట్ జనరల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటామని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. Also Read : కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు […]
ఏపీలో ఇటీవల నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 నగరపంచాయతీ, గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కొన్ని స్థానాల్లో వైసీపీ దూసుకుపోగా, మరొకొన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు సత్తాచాటారు. అయితే తాజాగా కొండపల్లి మున్సిపాలిటీకి చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొండపల్లి మున్సిపాలటీలో 29 స్థానాలు ఉండగా అందులో 14 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలువగా, మరో 14 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీరితో […]
దొంగతనం కేసులో పోలీసులు మరియమ్మ అనే మహిళను తీసుకెళ్లారు. అనంతరం ఆమెను విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేసి చంపేసినట్లు ఆరోపనలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా మరియమ్మ లాకప్‌డెత్ కేసు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మరియమ్మ లాకప్‌డెత్‌పై హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టనుంది. మరియమ్మ మృతిపై గతంలోనే హైకోర్టుకు మెజిస్ట్రేట్ నివేదిక సమర్పించారు. అయితే కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కేసు పూర్తి వివరాలను […]