అహ్మదాబాద్‌లో జరిగిన రిసెర్చ్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా (ఆర్ఎస్ఎస్డీఐ) వార్షిక సమావేశంలో హైదరాబాద్‌కు చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ సీహెచ్ వసంత్ కుమార్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆర్ఎస్ఎస్డీఐ సొసైటీ ప్రజలకు మధుమేహంపై అవగాహన కల్పించడమే కాకుండా పరిశోధనలు నిర్వహిస్తుంటుంది. ఈ సోసైటీలో వివిధ దేశాల నుంచి 9,400 మంది సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా డా.వసంత్ కుమార్ మాట్లాడుతూ.. “భారతదేశం అంతటా మరిన్ని పరిశోధనలు, ప్రజలకు అవగాహన కల్పించే […]
చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ.. నిన్న విశాఖపట్నంలోని నర్సీపట్నం టీడీపీ నేత అయ్యపాత్రుడు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ధర్నా కాస్తా పోలీసుల ఎంట్రీతో రసభాసగా సాగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత, చింతలపూడి విజయ్ సహా 16 మందిపై నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. విపత్తు నిర్వహణ చట్టం ఉల్లంఘన కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. […]
నేటి నుంచి భారత్-న్యూజిలాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. కాన్పూర్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాల సివిల్ సప్లై మంత్రులతో నేడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పలు కీలక విషయాలపై చర్చించనున్నారు. ఢిల్లోని సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ నేతల కీలక భేటీ నిర్వహించనున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేడు బీసీ, ఎస్సీ, […]
విధి వక్రీకరించడంతో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సీఐ అనంతలోకాలకు పయనమయ్యాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. పట్టణంలోని త్రీటౌన్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్న ఈశ్వరరావు విధులు ముగించుకొని తెల్లవారుజామున ఇంటికి బయలు దేరారు. అయితే ఎండాడ వద్ద గల జాతీయ రహదారిపై 3.40 గంటలకు గుర్తుతెలియని వాహనం వచ్చి సీఐ ఉన్న పోలీసు వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో సీఐ అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐతో పాటు ఉన్న కానిస్టేబుల్ సంతోష్ కు […]
మేషం :- ఆలయాలను సందర్శిస్తారు. మీ బాధ్యతలు, పనులు మరొకరికి అప్పగించి ఇబ్బందు లెదుర్కుంటారు. ఉన్నత విద్యా, విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. వితండవాదాలు, హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. వృషభం :- ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. చిన్నతరహా, చిరు వ్యాపారులకు ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పడు. పరిశోధకులకు గణిత, సైన్సు ఉపాధ్యాయులకు […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ రోజు జీహెచ్ఎంసీ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్లు యత్నించారు. మేయర్ ఛాంబర్లోకి ఒక్కసారి దూసుకెళ్లి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో మేయర్ ఛాంబర్ రణరంగంగా మారింది. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బీజేపీ కార్పొరేటర్లను మేయర్ ఛాంబర్ నుంచి బయటకు పంపించారు. అంతేకాకుండా మేయర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లను అతికించారు. 5 నెలల క్రితం వర్చువల్ మీటింగ్ పెట్టినా ఎలాంటి […]
కొండపల్లి చైర్మన్ ఎన్ని వాయిదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. అంతేకాకుండా విధ్వంసం సృష్టించి వాయిదా వేయించడం దారుణమని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన అన్నారు. ఎన్నిక నిర్వహణ రాకపోతే ఎస్ఈసీ, డీజీపీలు తప్పుకోవాలని ధ్వజమెత్తారు. ఎన్నిక అడ్డుకోవడమెందుకు.. వైకాపా వారినే చైర్మన్ చేయండి అంటూ మండి పడ్డారు. టీడీపీ సభ్యులను లోబర్చకోని కొండపల్లిలో పాగా వేయాలని చూస్తున్నారన్నారు. కౌన్సిల్ కార్యాలయంలోకి సంబంధం లేని […]
ఇటీవలే ఏపీలో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 నగరపంచాయతీ, గ్రామపంచాయతీల ఎన్నికల జరిగిన విషయం తెలిసింది. అయితే కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో 29 స్థానాలు ఉండగా 14 స్థానాల్లో వైసీపీ 15 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే 16 సభ్యుల కోరం ఉంటేనే చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్ కార్యాలయం వద్దకు నిన్న టీడీపీ, వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. […]
మొన్నటి వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు ఏపీని కుదిపేశాయి. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చెరువులకు గండిపడిపోవడంతో గ్రామాల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నెల్లూరు జిల్లాలోని సోమశిల డ్యామ్ తెగిపోతుందని ఆకతాయిలు వదంతులు సృష్టించారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా కొందరు గ్రామాలను వదిలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో అధికారులు అలర్ట్ అయిన అధికారులు సొమశిల డ్యామ్ సురక్షితంగా ఉందని వదంతులు నమ్మి […]
ప్రపంచంలోని అత్యంత అత్యాధునిక, వినూత్నమైన వీఎఫ్ఎక్స్ స్టూడియోలలో ఒకటైన జర్మనీకి చెందిన స్కాన్‌లైన్ వీఎఫ్ఎక్స్ను కొనుగోలు చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. కంటెంట్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మరింత ముందుకు వెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. స్కాన్‌లైన్ “స్ట్రేంజర్ థింగ్స్” “కౌబాయ్ బెబాప్”తో సహా అనేక నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్లపై ఈ స్టూడియో పని చేసింది. అనేక మార్వెల్, డీసీ టైటిల్స్ కోసం స్కాన్‌లైన్ స్టూడియో వైవిధ్యమైన ఎఫెక్ట్స్ ను అందించింది. 1989లో స్థాపించబడిన స్కాన్లైన్కి వాంకోవర్, మాంట్రియల్, […]