హైదరాబాద్‌లో మహిళల డెడ్ బాడీలు కలకలం రేపుతున్నాయి. చర్లపల్లి రైల్వై స్టేషన్ పక్కనే మహిళ డెడ్ బాడీ ఘటన మర్చిపోక ముందే రాజేంద్రనగర్ కిస్మత్‌పురా వద్ద మరో మహిళ మృతదేహం.. నగ్నంగా పడి ఉంది. ఆ మహిళ ఎవరు? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? ఆమెను అక్కడే చంపేశారా? ఎక్కడైనా చంపేసి కిస్మత్‌పురాలో పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో దుర్వాసన రావడంతో సెప్టెంబర్ 16న గుర్తించారు స్థానికులు. మహిళ డెడ్ బాడీ.. నగ్నంగా పడి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు స్టార్ట్ చేశారు పోలీసులు. చనిపోయిన మహిళను నాంపల్లి చెందిన రేష్మ బేగంగా గుర్తించారు…
Rakul Preet : రకుల్ పరువాల నిధులు.. చూస్తే మతులు పోవాల్సిందే
కానీ నాంపల్లి నుంచి రాజేంద్రనగర్ కిస్మత్‌పురా వరకు మహిళ ఎలా వచ్చారు? అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మహిళ మృతదేహం పైన ఎలాంటి దుస్తులు లేకపోవడం.. అతి కిరాతకంగా చంపేయడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళ పైన అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే విచారణ చేస్తున్నట్లు చెబుతున్నారు… గుర్తు తెలియని వ్యక్తులు.. ఆటోలో మహిళ డెడ్ బాడీని తీసుకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అప్పటికే ఆమె ఒంటిపై దుస్తులు లేవని చెప్పారు. దర్యాప్తులో భాగంగా కొంత సమాచారం సేకరించారు పోలీసులు. ఆమె ఆఘాపురా నుంచి ఆటోలో కిస్మత్ పురా వచ్చినట్లు చెబుతున్నారు. అక్కడే కల్లు కాంపౌండ్‌లో కల్లు తాగినట్లు తెలిపారు. కానీ ఆ తర్వాత ఆమెను తీసుకువెళ్లింది ఎవరు..? ఆమెను హత్య చేసింది ఎవరు..? అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. అత్యాచారం, హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు రాజేంద్రనగర్ పోలీసులు వెల్లడించారు…
Mirai : తేజ నిర్ణయం సక్సెస్.. మిగతా హీరోలు ఫాలో అయితే బెటర్..