Aarogyasri : ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలపై ప్రైవేట్ ఆసుపత్రులు సమ్మెకు దిగుతాయన్న వార్తల నేపథ్యంలో, రాష్ట్రంలో 87 శాతం ఆసుపత్రులు యథావిధిగా సేవలు అందిస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఆరోగ్యశ్రీ కింద నమోదైన 477 ఆసుపత్రులలో కేవలం 62 ఆసుపత్రులు మాత్రమే సేవలను నిలిపివేశాయి. మిగతా 415 ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
CV Anand: పహల్గామ్ బాధితుల కోసం రాజకీయ, సినీ ప్రముఖుల క్రికెట్.. HCAకు సీవీ ఆనంద్ కౌంటర్
ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, సమ్మెకు పిలుపునిచ్చినప్పటికీ ఎక్కువ శాతం ఆసుపత్రులు రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాయని తెలిపారు. గత రెండు వారాలుగా ఆరోగ్యశ్రీ కింద రోజుకు సగటున 844 సర్జరీలు నమోదయ్యాయని, సమ్మె పిలుపునిచ్చిన రోజున కూడా 799 సర్జరీలు జరిగాయని ఆయన వెల్లడించారు. సేవలు నిలిపివేసిన ఆసుపత్రులకు మరోసారి విజ్ఞప్తి చేసిన సీఈవో, రోగులకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే సేవలను పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా, ప్రైవేటు ఆసుపత్రుల సమ్మె నేపథ్యంలో రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఈ చర్యల వల్ల రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రకటనతో ఆరోగ్యశ్రీపై ఆధారపడిన పేద రోగులకు పెద్ద ఉపశమనం లభించింది. ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు పునరుద్ఘాటించారు.
Tragedy : ఇది చాలా ఘోరం.. అత్త శ్రద్ధాంజలి బ్యానర్‌తో వస్తూ అల్లుడు మృతి