దక్షిణాఫ్రికాలో గత నెల వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే భారత్‌లోని పలు రాష్ట్రాల్లో వ్యాపించింది. అయితే తాజాగా ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదవడంతో స్థానికంగా కలకలం రేగింది. ఉద్యోగం కోసం దక్షిణాఫ్రికాలో ఉంటూ ఇటీవలే ప్రకాశం జిల్లా ఒంగోలుకు వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ గా నిర్దారణైంది. విదేశాలలో చేయించుకున్న పరీక్షల్లో నెగిటివ్ రాగా, ఒంగోలులో మరోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తి శ్యాంపిల్స్‌ను హైదరాబాద్ […]
నేటి నుంచి దక్షిణాఫ్రికాలో భారత జట్టు పర్యటించనుంది. దక్షిణాఫ్రికాతో భారత జట్టు 3 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. సెంచూరియన్ వేదికగా ఈ రోజు భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. హైదరాబాద్ నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,480లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,350లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,100గా ఉంది. సిద్ధిపేట జిల్లాలోని […]
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేడు ఆయన సొంతూరులో పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని పొన్నవరం ఆయన స్వగ్రామం. అయితే ఆయనను గ్రామస్థులు ఎడ్లబండిపై ఊరేగింపు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థుల అభినందన సభలో మాట్లాడుతూ.. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోను.. నేను పుట్టిన ఊరంటే నాకు చాలా ఇష్టమని ఆయన అన్నారు. చిన్నతనంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. 1967లోనే రాజకీయంగా చైతన్యమైన గ్రామం మాది. […]
హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడి బర్త్‌డే పార్టీ ఫ్లెక్సీలను చిన్నపిల్లలతో కట్టించాడు. అయితే ఫ్లెక్సీలను కడుతున్న సమయంలో ఇద్దరు చిన్నారులు కరెంట్‌షాక్‌కు గురయ్యారు. దీంతో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. చిన్నారులను పరీక్షించిన వైద్యులు ఓ పిల్లవాడికి చేతులను తీసివేశారు. అయితే మరో పిల్లాడి కాళ్లు, పొట్టభాగంలో తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. పిల్లల పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. […]
ఆదాయం పన్ను నుంచి తప్పించుకునేందు కొంతమంది తప్పుడు దారులను అన్వేషిస్తున్నారు. తీరా అధికారుల సోదాల అసలు విషయం బయట పడడంతో జైలు పాలవుతున్నారు. అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. యూపీ సమాజ్‌వాదీ పార్టీ నేత, వ్యాపారి పీయూష్ జైన్ తన వ్యాపారంలో వచ్చిన ఆదాయంపై పన్ను ఎగ్గొట్టేందుకు నకిలీ ఇన్వాయిస్లు, ఈ-వే బిల్లులు సృష్టించాడు. అంతేకాకుండా వాటిని ఉపయోగించి అధికారులను బురిడి కూడా కొట్టించారు. ఆ తరువాత అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేయగా […]
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ్ నేడు సొంతూరులో పర్యటిస్తున్నారు. కృష్ణ జిల్లాలోని పొన్నవరం ఆయన స్వగ్రామం. అయితే సీజేఐ హోదాలో మొదటి సారి ఆయన స్వగ్రామానికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనను ఎండ్లబండిపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. అంతేకాకుండా కాకుండా ఆయన గ్రామస్థుల అభినందన సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీజేఐ సొంతూరు పర్యటనను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేయండి.
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని పెద్దలు అన్న మాటను నిజం చేశారు ఈ అవిభక్త కవలలు. చేతులు, తలలు వేరుగా ఉన్నా కాళ్లు మాత్రం మొత్తం రెండు మాత్రమే ఉన్న ఈ అవిభక్త కవలలు.. తమ లోపానికి దిగులు చెందకుండా పట్టుదలతో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. పంజాబ్‌కు చెందిన సోనా సింగ్, మోనా సింగ్‌లు చిన్నప్పుడే జన్యుపరమైన లోపంతో జన్మించారు. అయితే వారు చిన్నప్పటి నుంచి పింగిల్వాడా అనే సంస్థలో పెరుగుతూ చదువుకున్నారు. అయితే వారిని […]
ఏపీ టెకెట్ల ధరలపై రచ్చ జరుగుతూనే ఉంది. గత మూడు రోజులుగా ఏపీలోని సినిమా థియేటర్లపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించి సరైన పత్రాలు లేని సినిమా హాల్‌లను మూసివేస్తున్నారు. అయితే విశాఖపట్నం జిల్లాలోని సినిమా థియేటర్లను కూడా నిన్నటి నుంచి తనిఖీ చేస్తున్నారు. ఈ రోజు కూడా జిల్లాలోని సినిమా థియేటర్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. నగరంలోని జగదాంబ, మెలోడీ థియేటర్ లలో ఆర్డీవో తో కలిసి జిల్లా కలెక్టర్ స్వయంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో […]
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో మాటల యుద్ధ నడుస్తూనే ఉంది. ఇటీవల తెలంగాణ మంత్రులు ఢిల్లీ పెద్దలను ధాన్యం కొనుగోళ్లపై కలిసేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మంత్రులను అవమాన పరిచి ఢిల్లీ నుంచి పంపితే భవిష్యత్ లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. జాతీయ పార్టీల నేతలు ఢిల్లీకి పైరవీ ల కోసం వెళతారు కానీ.. మేము తెలంగాణ ప్రయోజనాల కోసం వెళతామంటూ ఆయన వ్యాఖ్యానించారు. అడుక్కోవడానికి మేము […]
రోజురోజుకు తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. కరోనా కేసుల వైద్యం కోసం అదనపు పడకలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా దాని తీవ్రత తక్కువేనని ఆయన తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చిన తట్టుకొనే విధంగా 1400 పడకలు హైద్రాబాద్ లో ఏర్పాటు చేశామన్నారు. నిలోఫర్‌లో 800 పడకలు ఏర్పాటు చేస్తున్నామని, మరో 6 […]