బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో గల నూడుల్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. నూడుల్స్ పరిశ్రమలో వినియోగిస్తున్న ఓ బాయిలర్ ప్రమాదవశాత్తు పేలింది. దీంతో అక్కడే ఉన్న 10 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరి కొందరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనపై సమాచారం అందిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగవచ్చని సమాచారం. ఈ […]
హైదరాబాద్ హైటెక్స్ లో స్కూల్ లీడర్షిప్ సమ్మిట్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ను మాజీ ఎంపీ, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎంపీగా ఉన్నప్పుడు నాటి మంత్రి స్మృతి ఇరానీ గారితో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి చర్చించాం.. కొన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ఎడ్యుకేషన్ పాలసీ గురించి మా సూచనలు తెలియజేసాం.. కొన్ని రాష్ట్రాలలో మాతృ భాషలో పరీక్షల నిర్వహన గురించి కొన్ని సమస్యలు […]
ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. అయితే ఇటీవల ఏపీలో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6కు చేరుకుంది. ఒమిక్రాన్ వ్యాప్తిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా ఏపీ ప్రభుత్వంలో చలనం లేదంటూ ఆరోపించారు. ప్రజల ప్రాణాలకంటే కక్ష సాధింపు చర్యలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. వ్యాక్సినేషన్లో ఏపీ వెనకబడిందని, ఇతర […]
ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇండియాలో కూడా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లతో ప్రజలు, ప్రభుత్వాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి లాక్డౌన్ విధిస్తే ఆర్థిక రాష్ట్రాల్లో కురుకుపోయే ప్రమాదం లేకపోలేదు. ఇటు చూస్తే ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ […]
గత 2 సంవత్సరాలుగా అగ్రదేశమైన అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో భయాందోళన సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తి తగ్గడం లేదు. కరోనా కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతూ ప్రజలు విరుచుకుపడుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి రావడంతో ఇప్పడు మరోసారి ప్రపంచ దేశాలు సైతం భయాందోళన చెందుతున్నాయి. అయితే తాజాగా ఇండియాలో 6,987 కరోనా కేసులు రాగా, 162 మంది కరోనా సోకి మరణించారు. అయితే ప్రస్తుతం 76,766 కరోనా కేసులు […]
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోరుతూ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ రేడు ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి, ఉపాధి అవకాశాల విషయంలో బీజేపీ వైఫల్యాలపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. బండి సంజయ్‌ది ఉద్యోగ దీక్ష కాదు.. సిగ్గులేని దీక్ష అంటూ ధ్వజమెత్తారు. బండి సంజయ్ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమేనని, బీజేపీ ప్రభుత్వం […]
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా దేశంలోని రాష్ట్రాల్లో పాకుతోంది. ఇప్పటికే దేశంలోని 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో కూడా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే తాజాగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ఆయా జిల్లాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దక్షిణాఫ్రికాలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ మీదుగా ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరుకున్నాడు. అయితే ఆ వ్యక్తికి దక్షిణాఫ్రికాలో నిర్వహించిన టెస్టుల్లో నెగటివ్ […]
కరనా రక్కసి మరోసారి ఒమిక్రాన్ రూపంలో రెక్కలు చాస్తోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్‌తోనే ప్రపంచ దేశాలు సతమతమవుతుంటే.. ఇప్పుడు ఒమిక్రాన్ పలు దేశాలకు వ్యాపించి దాని ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు సంఖ్య 1,83,240కి చేరుకుంది. ఇప్పటి వరకు 31 మంది ఒమిక్రాన్ సోకి మృతి చెందారు. యూకేలో 1,14,625 ఒమిక్రాన్ కేసులు ఉండగా, డెన్మార్క్‌లో 32,877, కెనడాలో 7,500, యూఎస్‌లో 6,331 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే పలు దేశాలు విదేశాల […]
మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సీపీఎం రాష్ట్ర మహాసభలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ మహాసభలు గత సంవత్సరమే నిర్వహించాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో 4వ సంవత్సరంలో ఈ మహాసభలు నిర్వహిస్తున్నారు. అయితే నాలుగేళ్లలో పార్టీ చేసిన ఉద్యమాలు ఈ సభలో చర్చించనున్నారు. అంతేకాకుండా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఈ మహాసభల్లో నిర్ణయం తీసుకోనున్నారు. వీటితో పాటు వివిధ రాజకీయ అంశాలపై సభలో తీర్మానాలు చేసే అవకాశం ఉంది. […]
ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆంధ్రవాసులు సంక్రాంతి పండుగకు ఊరు చేరుకుంటారు. ప్రతి సంవత్సరాలాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేక బస్సుల నడపేందుకు ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి 320 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. జనవరి 9 నుంచి 13వ తేదీ మధ్య వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా […]