Modi Plan Fail : టార్గెట్ కాంగ్రెస్.. విల్లు విభజన.. మోడీ ప్లాన్ రివర్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశానికి ప్రధాని స్థానంలో ఉన్న మోడీ.. బీజేపీ రథాన్ని ముందుండి లాగుతున్నారు. ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉంది. అయితే ఈ సమయంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు వేదికగా ఉపయోగించుకొని.. మోడీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. కానీ.. ఆయన టార్గెట్ చేసిన కాంగ్రెస్ కు వినియోగించిన విల్లు ‘ఏపీ విభజన’. అయితే కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ.. మోడీ వదిలిన విభజన బాణం వ్యతిరేక పవనాలు వీయడంతో తిరిగి ఆయనకే గుచ్చుకుంది. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఏపీ విభజన సరిగ్గా జరగలేదని, ఇప్పటికీ విభజన కారణంగా తెలుగు రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. అదే మా(బీజేపీ) హయాంలో జరిగిన విభజనలు ఎంతో బాగున్నాయని ఆయన చెప్పకనేచెప్పారు. అయితే ఏపీ విభజనపై వ్యాఖ్యానిస్తే.. ఇటు 5 రాష్ట్రాల ఎన్నికల్లో, అటు తెలంగాణలోనూ కాంగ్రెస్‌పై ఎంతో కొంత విముఖత ఏర్పడి బీజేపీ బలోపేతానికి కృషి చేస్తుందనేది మోడీ మాస్టర్ ప్లాన్ అయ్యుండవచ్చు.. కానీ ఆయన వదలిన బాణం సరైన సమయంలో కాకపోయేసరికి తన వేలుతో బీజేపీ నేతల కళ్లు పొడిచిన పరిస్థితి నెలకొంది.
కాంగ్రెస్‌ను టార్గెట్‌ను చేయడం పక్కన పెడితే.. మోడీ వ్యాఖ్యలపై తెలంగాణలో అగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. సదవు రానివాడు ప్రధాని అయితే ఇలాగే ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంటుంటే.. తెలంగాణపై మోడీ తనకున్న విషం కక్కుతున్నారని.. అందుకే విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చడం లేదని టీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఏదేమైనా.. మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ నేతల పీటం కిందకు నీళ్లు తెచ్చేవిధంగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషుల భావన. ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలపడుతున్నామని మనోధైర్యంతో ఉన్న బీజేపీ నేతలు గుండెల్లో.. మోడీ వ్యాఖ్యలు గుండుసుదుల్లా.. గుచ్చినట్లే కనిపిస్తోంది. చూడాలి మరి.. మోడీ వ్యాఖ్యల ప్రభావం 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు.. తెలంగాణలో రాబోయే ఎన్నికలపై ఉంటుందో.. లేదోనని.
Also Read
తాజావార్తలు
-
Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ చేతికి రాడ్స్ తొలగింపు.. సెట్స్‌పైకి రీఎంట్రీ ఎప్పుడంటే?
-
Comrade Kalyan : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా ?
-
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
-
Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
-
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!