న్యాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్‌సింగరాయ్ సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాని శ్యామ్‌సింగరాయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఏపీలో భగ్గుమన్నాయి. తాజాగా నాని వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలనే టికెట్ ధరలు తగ్గించామని బొత్స అన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా అధికారులను ఆశ్రయించాలని, మాకు ఇబ్బందులు ఉన్నాయని చెబితే ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. మార్కెట్లో ఏదైనా […]
పెరల్స్ చిట్‌ఫండ్ స్కాం కేసులో సీబీఐ 11 మందిని అరెస్ట్ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 11 మందిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 5 కోట్ల మంది ఖాతాదారుల నుంచి రూ.60 వేల కోట్లు వసూలు చేసి మోసం చేసిందని గతంలోనే సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో పెరల్స్ చైర్మన్ చంద్రభూషణ్, ప్రేమ్ సేత్తో పాటు మరో 9 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. 2014లో పీజీఎఫ్తో పాటు పెరల్స్ గ్రూప్‌పై సీబీఐ […]
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో నేడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. బహిరంగ సభకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ క్రింది వీడియో లింక్‌లో వీక్షించండి..
రైతన్న దేశానికి వెన్నుముక అన్న మాట చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటాం కూడా. అయితే దేశానికి వెన్నుముకలాంటి రైతన్న వెన్నులో వణుకుపుట్టించే విధంగా రాజకీయ పార్టీలు వాటి లబ్దికోసం రాక్షస క్రీడ ఆడుతున్నాయి. రాజకీయ పార్టీలు ఆడే రాజకీయ రాక్షస క్రీడలో రైతన్నను పావుగా మారుతున్నాడు. మా ప్రభుత్వంలో రైతులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతాం.. నకిలీ విత్తనాలు, ఎరువులును ఆరికడతాం.. పంటకు మద్దతు ధర ఇస్తామంటూ […]
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు అవసరమైన రెండు బస్సు సర్వీసులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రారంభించిన బస్సు సర్వీసులో టికెట్ కొనుగోలు చేసి మంత్రి మంత్రి పెద్దిరెడ్డి బస్సులో ప్రయాణించారు. పుంగనూరు పరిధిలోని ఎస్.అగ్రహారం, ఏ.కొత్తకోట మధ్య విద్యార్థులకు అనువైన సమయంలో బడిబస్సు ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా ప్రజల అవసరాల మేరకు పుంగనూరు నుండి మండల కేంద్రాల మీదుగా చిత్తూర్, అక్కడి నుండి చెన్నై కు […]
నేటి అత్యాధునిక సమాజంలో టెక్నాలజీని మంచికి వాడేవారికంటే చెడుకు వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరికొందరు మాత్రం చెడు దారుల్లో వెళుతున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. షేట్‌బషీరాబాద్‌కు చెందిన ఓ కార్పొరేట్ స్కూల్ నిర్వాహకులు కరోనా నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీచర్లు 7వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసు నిర్వహిస్తున్న సమయంలో, ఓ అగంతకుడు ఆ 7వ […]
ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచేవీలు లేదంటూ జీవో 35ను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోపై పలువురు సినీ నిర్మాతలు, డస్ట్రిబ్యూటర్లు హైకోర్టులో ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి ప్రభుత్వం జారీ చేసిని జీవో 35ను రద్దు చేస్తున్నట్లు, టికెట్ల ధరలు పెంచుకునేలా అవకాశం కల్పిస్తూ తీర్పునిచ్చింది. అయితే సింగిల్ జడ్జీ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం డివిజన్ […]
వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో ఇంటికి ఒకటే మీటర్ ఉండాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు నోటీసులివ్వడం దుర్మార్గమని ఆయన అన్నారు. దశాబ్దాల కాలం నుంచి ఒక ఇంటిలోని పోర్షన్ల ఆధారంగా విద్యుత్ సంస్థలు మీటర్లు ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు ఒకే ఇంట్లో ఎన్ని పోర్షన్లు ఉన్నప్పటికీ ఓకే మీటర్ ఉంచి, మిగతావి రద్దు చేసుకోవాలని ఎలక్ట్రిసిటీ అధికారులు నోటీసులు ఇస్తున్నారని ఆయన అన్నారు. ఫలితంగా మీటర్ […]
కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. ఇప్పడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి బయటపడుతున్న తరునంలో గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ భయంతో మరోసారి దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగూ వస్తోంది. తాజా దేశవ్యాప్తంగా 7,495 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 6,960 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 78,291 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న […]
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీల కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అధ్యాపకులు సర్వీసును రెన్యువల్ చేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. 31 మే 2022 వరకు 1,217 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ లెక్చరర్ల సేవలను పొడిగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే వీరిలో గౌరవ వేతనంపై పనిచేసే అధ్యాపకులు కూడా ఉన్నారు. అయితే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ […]