సీసీఐ వెంటనే పునరుద్దరించాలని మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌కి నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేస్తూ ఉద్యోగాలు తీసివేస్తోందని కేంద్రంపై హరీష్‌రావు నిప్పులు చెరిగారు. దేశంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగాలు నింపకుండా కాలయాపన చేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం, మూసివేయడం వల్ల రిజర్వేషన్ వర్గాలకు ఉద్యోగాలు దక్కడం లేదని ఆయన అన్నారు.
రాబోయే రోజులలో తెలంగాణలో ఖాళీగా యాబై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, కేంద్రం సీసీఐ పునప్రారంభిస్తే కొత్త పరిశ్రమకు ఇచ్చే రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ముగియగానే పెట్రోల్ ధరలు మళ్లీ పెంచుతారని, ఆర్టీసీ పై మోపిన డిజీల్ ధరలు తగ్గించాలని ఆయన కోరారు.