నేడు అనంతపురం జిల్లాలో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె పాలసముద్రం వద్ద నిర్మించనున్న జాతీయకస్టమ్స్ పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీకి భూమి పూజ నిర్వహించనున్నారు.
నేడు మణిపూర్‌లో రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 22 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.
నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హరీష్‌రావు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రలు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌లు పాల్గొననున్నారు.
నేడు రెండో రోజు భారత్-శ్రీలంక టెస్ట్ మ్యాచ్ జరుగునుంది. 357/6 స్కోర్‌తో పటిష్టస్థితిలో భారత్ ఉంది. క్రీజులో జడేజా (45), అశ్విన్ (10)పరుగులతో ఉన్నారు.
నేటి నుంచి శ్రీశైలంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం కానున్నాయి. మల్లికార్జున స్వామి స్పర్శదర్శనం పునఃప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,040లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,700లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 70,500కు చేరుకుంది.
నేడు ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. జప్రోజియా అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భేటీ కానుంది.
నేడు ఉక్రెయిన్ నుంచి భారత్‌కు 11 పౌర, 4 వాయుసేన విమానాలు రానున్నాయి. స్వదేశానికి మరో 2200 మంది భారతీయులు రానున్నారు.