Astrology: మార్చి 5, శనివారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం :- ఆసాధ్యమనుకున్న కేసులను సునాయాసంగా గెలుపొందుతారు. ఉపాధ్యాయులకు మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. ఏ ప్రయత్నం కలిసి రాకపోవటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. పెద్దల ఆహార, ఆరోగ్య వ్యవహారాలలో మెళుకువ అవసరం.
వృషభం :- నిత్యవసర వస్తు స్టాకిస్తులకు, రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. మీ ఉన్నతి చాటుకోవడం కోసం ధనం బాగా ఖర్చుచేస్తారు. ఉద్యోగస్తులు తోటివారితో విందు, వినోదాలలో పాల్గొంటారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు.
Also Read
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
- Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
- Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
మిథునం :- మీ శ్రీమతి సలహాను తేలికగా కొట్టివేయకండి. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో మాట పడటం వంటివి ఎదుర్కొంటారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. బంధువుల ఆకస్మిక రాకతో గృహంలో ఖర్చులు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కర్కాటకం :– ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. రవాణా రంగంలో వారికి సంతృప్తి కానరాగలదు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి.
సింహం :- నూనె, మిర్చి, కంది స్టాకిస్టు వ్యాపారస్తులకు అనుకూలింగానే ఉంటుంది. వృత్తులవారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి.
కన్య :- స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడివల్ల ఆందోళనలకు గురవుతారు. స్త్రీలు వీలైనంత వరకు మితంగా సంభాషించడం మేలు. బ్యాంకింగ్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించిన జారవిడుచుకుంటారు.
తుల :- కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించవలసి ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలం. బంధువులకు ధన సహాయం చేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. రాబడికి మించి ఆర్థిక విషయాల పట్ల దృష్టి సాగిస్తారు. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునపుడు జాగ్రత్త వహించండి.
వృశ్చికం :- సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటివ్‌లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.
ధనస్సు :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. కళత్ర ఆరోగ్యంలో గురించి ఆందోళన చెందుతారు. వ్యాపార వర్గాల వారికి పనివారలతో చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. ప్రియతముల రాక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది.
మకరం :- గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ఉన్నత విద్య, పరిశోధనలు, చర్చలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. రాజకీయాలలో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. ఇర్చులు మీ అంచనాలను మించటంతో ఒకింత ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కుంభం :- మీ ఓర్పు, విజ్ఞతకు ఇది పరీక్షా సమయమని గమనించండి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసి వస్తుంది. స్త్రీలకు చాలా యోగప్రదంగా వుండగలదు.
మీనం :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు సంభవిస్తాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలకు అడ్డంకులు తొలగిపోగలవు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు చికాకులు, నిరుత్సాహం వంటివి తలెత్తుతాయి.
తాజావార్తలు
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!