Uttam Kumar Reddy : తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన జలాల విషయంలో ఎటువంటి రాజీ ఉండదని, అవసరం అయితే ఏ రాష్ట్రంతోనైనా పోరాడతామని జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదులలో తెలంగాణకు చట్టబద్ధంగా లభించాల్సిన హక్కు వాటాను కచ్చితంగా సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందని ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోందని గుర్తుచేశారు. రేపు ఢిల్లీకి వెళ్లి తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపిస్తానని, ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని ఆయన స్పష్టం చేశారు.
X Account Hack: ఎవర్రా మీరంతా.. ఏకంగా డిప్యూటీ సీఎం ఎక్స్ అకౌంట్‌నే హ్యాక్ చేశారు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణను ప్రస్తావిస్తూ, ఈ ప్రాజెక్టులో ఎవరైనా తప్పు చేసి ఉంటే వారు ఎంతటి వారైనా చట్టానికి అతీతులు కాదని మంత్రి హెచ్చరించారు. తగిన ఆధారాలు బయటకు వస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన వెల్లడించారు. జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని వివరించిన ఉత్తమ్, ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో ఎవరితోనైనా, ఏ స్థాయిలోనైనా పోరాటానికి వెనుకాడమని ఆయన పునరుద్ఘాటించారు.
The last Solar Eclipse : ఈ ఏడాదిలో నేడు కనిపించనున్న చివరి సూర్య గ్రహణం..