CMRF Fraud : సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల గోల్‌మాల్ కేసు.. మరో ఇద్దరు అరెస్టు
- సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల గోల్‌మాల్ కేసులో మరో ఇద్దరు అరెస్టు
- ఇప్పటివరకు మొత్తం 19 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- నకిలీ లబ్ధిదారుల ఖాతాల్లోకి మళ్లిన చెక్కులు
- మాజీ మంత్రి కార్యాలయంలో పనిచేసిన నరేశ్‌పై కీలక ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CMRF Fraud : హైదరాబాద్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల గోల్‌మాల్ కేసు దర్యాప్తులో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైనవారు పగడాల శ్రీనివాసరావు (22), యాస వెంకటేశ్వర్లు (50)గా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయి. సెప్టెంబర్ 19న జూబ్లీహిల్స్ పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో పొట్ల రవి, జంగమ నాగరాజు, మటేటి భాస్కర్, ధర్మారం రాజు, కాంపల్లి సంతోశ్, చిట్యాల లక్ష్మి, అసంపెల్లి లక్ష్మి ఉన్నారు. తాజా అరెస్టులతో కలిపి ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
దర్యాప్తులో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను నకిలీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారని, ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసి అసలైన బాధితులను మోసం చేసినట్లు బయటపడింది. మొత్తం రూ. 8.71 లక్షలు అక్రమంగా విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు. అలాగే 2023 ఎన్నికల తర్వాత 19 చెక్కులు నకిలీ ఖాతాల్లోకి మళ్లించబడినట్లు తేలింది. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ వ్యవహారంపై ఐదు కేసులు నమోదయ్యాయి.
ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు నరేశ్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీశ్‌రావు కార్యాలయంలో ఆయన పనిచేసినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీ ఓటమి అనంతరం 230 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను తనతో తీసుకెళ్లిన నరేశ్, అందులో 19 చెక్కులను పక్కదారి పట్టించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఇప్పటికే జులై 15న నరేశ్‌కుమార్‌తో పాటు వెంకటేశ్, వంశీ, ఓంకార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో కేసు మరింత మలుపు తిరిగింది.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!