భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ప్రధాన కూడలిలో ఈరోజు ఉదయం బూర్గంపాడు ఎస్సై జితేందర్ తన సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా భద్రాచలం నుంచి సారపాక వైపుకు మోటారు సైకిల్‌పై ఒక బ్యాగ్‌తో వస్తున్న ఇద్దరిని అనుమానంతో పోలీసులు విచారించారు. వారి పేర్లను హేమల గంగి, సవలం నగేష్ అని చెప్పడంతో వారి వద్ద ఉన్న బ్యాగ్ ను తనిఖీ చేయగా వారి వద్ద పేలుడు పదార్థాలు ఉండటంతో వారి ఇరువురిని పోలీసులు అదుపులోకి […]
ఘన్ శ్యాందాస్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ ఎండీ సంజయ్ అగర్వాల్ పై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తప్పుడు పత్రాలతో సంజయ్ అగర్వాల్ బ్యాంకులను రూ.90కోట్ల మోసం చేసినట్లు ఈడీ వెల్లడించింది. సీబీఐ కేసుల ఆధారంగా మనీలాండరింగ్ విచారణను ఈడీ చేపట్టింది. బ్యాంకుల నుంచి మోసపూరితంగా పొందిన సొమ్ముతో నగల దుకాణాలు తెరిచారని ఈడీ పేర్కొంది. అంతేకాకుండా కుటంబ సభ్యుల పేరిట సంజయ్ అగర్వాల్ నాలుగు నగల దుకాణాలు తెరిచారని, సంజయ్ కుమార్ తప్పుడు పేరుతో […]
న్యూయార్క్ స్టాక్ ఎక్చైంజ్(NYSE) లిస్టెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఫిస్కర్ ఇంక్ తన భారత ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఇది సాఫ్ట్వేర్ మరియు వర్చువల్ వెహికల్ డెవలప్మెంట్ సపోర్ట్ ఫంక్షన్లపై దృష్టి సారిస్తుంది. కాలిఫోర్నియాకు చెందిన ఈవీ తయారీ సంస్థ ఇప్పటికే నియామక ప్రక్రియను ప్రారంభించిందని, దీంతో భారతదేశంలో 200 మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రపంచ సంస్థలను ఆకర్షించేందుకు పరిశ్రమలు మరియు ఐటి శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని […]
యాసంగిలో పండించిన ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయ తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఒక్కొక్క కోనుగోలు కేంద్రాలు దగ్గర నోడల్ ఆఫీసర్, మిల్లులు దగ్గర ఒక ఆఫీసర్ ఉంటారని ఆయన తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో 36 లక్షలు ఎకరాలలో సాగు జరిగిందని, 65 లక్షలు మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. […]
హేట్ స్పీచ్ కేసులో అక్బరుద్దీన్ ఓవైసీని నిర్ధోషిగా ప్రకటిస్తూ నాంపల్లి కోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ కేసును కావాలనే నీరుగార్చారని ఆరోపించారు. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కుమ్కక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి..? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఈ మూడు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని, నిర్మల్ కేసుపై తక్షణమే అప్పీల్ కు వెళ్లాలని డిమాండ్ చేశారు. […]
సీఎం కేసీఆర్ నిన్న యాసంగి ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వమే కొనుగోళు చేస్తుందని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లపై కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం జనగామ కలెక్టరేట్ రైస్‌మిల్లర్లు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ అత్యంత కష్ట, క్లిష్ట సమయంలోనూ సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారని వెల్లడించారు. రూ.3వేల కోట్ల నష్టాన్ని […]
కరోనా మహమ్మారి మళ్లీ రెక్కలు చాస్తోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతున్న కరోనా.. ఇప్పుడు మరోసారి తన ప్రభావాన్ని చూపుతోంది. యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడి తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారు. అయితే మొన్నటికి మొన్న ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ సృష్టించిన కరోనా.. ఇప్పుడు మరోసారి దేశంలో విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్ నోయిడాలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 48 గంటల్లో 53 కరోనా […]
మజ్లిస్ కీలక నేత, తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ద్వేషపూరిత ప్రసంగం కేసులో భారీ ఊరట లభించింది. 2012 డిసెంబర్లో హిందువులను ఉద్దేశించి అక్బర్ తీవ్ర వ్యాఖ్యలుచేశారు. నిజామాబాద్, నిర్మల్‌లో చేసిన వ్యాఖ్యలపై ఒక వర్గం తీవ్రంగా స్పందించింది. ఆయన పై కేసులు నమోదయ్యాయి. అక్బరుద్దీన్‌పై రెండు కేసులనూ నాంపల్లి సెషన్స్ కోర్టు బుధవారం నాడు కొట్టవేస్తున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 2012 డిసెంబర్ నెలాఖరులో ఆదిలాబాద్, […]
ఉద్యోగుల పరస్పర బదిలీలపై జీఓ 402ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని యుయస్పీసి స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది. ఉద్యోగుల లోకల్ క్యాడర్ కేటాయింపు నిబంధనలపై సంఘాలతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా జీఓ నెం 317ను విడుదల చేసిన కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు న్యాయం చేయటానికి పరస్పర బదిలీలకు అనుమతించాలని యుయస్పీసి పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ స్టీరింగ్ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ […]