డబ్బై సంవత్సరాలుగా నిరాశ, నిస్పృహాతో ఉన్న వర్గాలకు వైసీపీ ఓ కాంతిరేఖగా, వెలుగు చుక్కగా ఉందని ఆయన రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన ప్రసాద్ రావు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ… బలహీనులు, అట్టడుగు కులాల కోరికలు తీర్చడం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని, ఎవరికీ తలవంచకుండా, ఎవరికీ లంచం ఇవ్వకుండా సంక్షేమ పథకాలను ఇంటి వద్దే పొందుతున్నారన్నారు. చంద్రబాబు పెన్షన్ ఇచ్చాడు. జెండా పెట్టాలి, పసుపు చొక్కా వెయ్యాలి, లేదా దేవుడి మీద ఒట్టు వేయాలి అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఆయారాం గయారం ప్రభుత్వం కాదు.. ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం, ఆశయం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది అని ఆయన వెల్లడించారు. డబ్బులు పంచేస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారని, అధికారంలోకి వస్తే ఆపేస్తావా… ఏం చేస్తావో చెప్పాలన్నారు.
సామాన్యులకు డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని వర్గాలు, మింగటానికి లేదని బాధపడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రయోజనం పొందుతున్న పేదవారు ఒక్క నయాపైసా అవినీతి జరగటం లేదని ఆయన వెల్లడించారు. బాదుడే బాదుడు అని తిరుగుతున్న చంద్రబాబు కూడా లంచం తీసుకున్నడని అనలేడని, ఆర్థిక కష్టాలలో కూడా తిత్లీ ఎమౌంట్ వేస్తున్నామన్నారు. చంద్రబాబు హాయాంలో టీడీపీ నేతలకే ప్రయోజనం చేసారన్నారు.