చిత్తూరు జిల్లాలో మాజీ మేయర్ హేమలత ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వైసీపీ కార్యకర్తల్లా మారి గాడి తప్పిన పోలీసు అధికారులను వదిలేది లేదన చంద్ర వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. జగన్ దయాదాక్షిణ్యాల కోసం కొందరు పోలీసులు ఇంతలా దిగజారి పోయారంటే ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. చిత్తూరులో మేయర్ దంపతుల హత్య కేసులో సాక్షులను వేధించి, అక్రమ కేసులు పెట్టడంలో అర్థం ఏమిటి.. నేరస్తులను కాపాడుతున్నారా..? అంటూ ఆయన ప్రశ్నించారు. పోలీసులే ఇంట్లో గంజాయి బస్తా పెట్టి కేసులు రాయడం దుర్మార్గమన్నారు.
పోలీసులు చేస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకోడానికి వచ్చిన చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలత మీదికి, మహిళ అని కూడా చూడకుండా పోలీసు జీపు ఎక్కించడానికి ఎంత ధైర్యం? ఎవరి అండ చూసుకుని ఇలా రాక్షసంగా రెచ్చిపోతున్నారు..? ప్రభుత్వం చేయించిన ఈ దౌర్జన్యకాండను తీవ్రంగా ఖండిస్తున్నా. వైసీపీ కార్యకర్తల్లా మారి తప్పులు చేస్తున్న పోలీసులను వదిలే ప్రసక్తి లేదు. పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తాం. మేం అధికారంలోకి వచ్చాక గాడి తప్పిన ప్రతి అధికారిపై చర్యలు తీసుకుంటామని ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.