111 జీవోను ఎత్తివేస్తామని గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి.. మాట్లాడుతూ.. గతంలో వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు 111 జీవోను ఎత్తివేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే 111 జీవో ఎత్తివేతపై సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు కేసీఆర్ తెలిపారు. పొల్యూషన్ బోర్డు, అటవీశాఖతో పాటు ఇతరులతో కలిసి ఎట్టిపరిస్థితుల్లో […]
అసలే కరోనా కాలం…. హాస్పిటల్ అంటేనే భయపడే కాలం… అలాంటి వాటిలో పని చేసేందుకు ఎవరు ముందుకు రారు.. అలాంటిది వారు ముందుకు వచ్చారు…. మొదట్లో మీకు ఇన్ని పని గంటలు… ఇంత జీతం అని పనిలో చేర్చుకొని… తీరా పని చేసిన తర్వాత చేతులెత్తేశారు… జీతాలు ఇవ్వకుండా చేతులేత్తేసింది ఎక్కడో ప్రైవేట్ కంపెనీ కాదు… ప్రభుత్వమే… గాంధీ హాస్పిటల్ లో కరోనా కోసం అని కాంట్రాక్ట్ ఎంప్లాయిస్‌ని తీసుకున్నారు… రోజుకు 500 రూపాయిల చొప్పున నెలకు […]
పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంలో ఏఐసీసీ , టీపీసీసీ పిలుపు మేరకు వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, కరెంటు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర తగ్గించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. వరి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తారా లేక కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తారా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు విని చాలా […]
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తూ.. కేంద్రంపై టీఆర్ఎస్ సమర శంఖం పూరించింది. అంతేకాకుండా సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ నేతలు నిన్న దేశ రాజధాని ఢిల్లీలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉప్పుడు బియ్యంగా మార్చకుండా కేంద్రానికి బియ్యం ఇయ్యండని, నూకల చార్జీ మీరు భరించండి.. నూకల వల్ల వచ్చే నష్టం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి […]
మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై విమర్శల గుప్పించారు. మంగళవారం ఆయన ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ప్రతి ఏటా బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించి, ఖర్చు చేస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని ఆయన మండిపడ్డారు. 2017-18 నుండి 2021-22 వరకు ఎంబీసీ కార్పోరేషన్‌కు బడ్జెట్ కేటాయింపులకు ఖర్చుకు అసలు పొంతనే లేదని ఆయన వెల్లడించారు. ఎంబీసీలకు గడిచిన నాలుగు బడ్జెట్లలో 3 వేల కోట్లు కేటాయించినట్లు కాగితాల్లో కనిపిస్తున్నా ఫైనాన్స్ విభాగంలో ఆమోదం […]
కరోనా రక్కసి కొత్తకొత్త వేరియంట్లతో ప్రజలపై విరుచుకుపడుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ నుంచి సబ్ వేరియంట్లు పుట్టుకోస్తున్నాయి. డెల్టావేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందే శక్తి ఒమిక్రాన్ వేరియంట్లకు ఉంది. అయితే మొన్నటికి మొన్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించి పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతుండడంతో వెంటనే అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినతరం చేయడమే కాకుండా, నైట్ లాక్డౌన్, వీకెండ్ లాక్డౌన్ ను విధించి థర్డ్‌వేవ్‌కు అడ్డుకట్టవేశాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ […]
హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణమండపంలో బీజేపీ ఓబీసీ మోర్చా బీసీ విద్యా వంతుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్దాల్లో, హామీలిచ్చి మాట తప్పడంలో కేసీఆర్ కు గిన్నిస్ బుక్ రికార్డు లో చోటు కల్పించవచ్చని ఆయన విమర్శించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీ కోటాలో కలిపితే వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన అన్నారు. ఆనాడు […]
తెలంగాణలోని ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య యుద్ధమే నడుస్తోంది. యాసంగిలో వరి వేయవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీజన్‌కు ముందే చెప్పినా.. తెలంగాణ బీజేపీ నేతల హామీలతో కొంతమంది వరి వేశారు. మరికొందరు రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఆరుతడి పంటలు వేసుకున్నారు. తీరా ఇప్పుడు యాసంగి పంట చేతికివచ్చే సమయానికి ధాన్యం కొనుగోలు విషయం చినికి చినికి గాలివానలా మారింది. యాసంగిలో పండించిన పారాబాయిల్డ్ రైస్‌ను కేంద్రం కొనుగోలు చేయాలని ఏకంగా రాష్ట్ర […]