ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస జగన్‌తో బ్యాడ్మింటన్ ప్రపంచ 11వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ భేటీ అయ్యారు. నేడు ఉదయం సచివాలయానికి వచ్చిన కిడాంబి శ్రీకాంత్‌తో సీఎం జగన్ చర్చించారు. అయితే.. శాప్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నేతృత్వంలో సీఎం జగన్ తో కిడాంబి భేటీ అయ్యారు. అయితే.. తాజాగా ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ లో కిడాంబి శ్రీకాంత్ పాల్గొన్నారు.
దాదాపు 30 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తొలి భారత పురుష షట్లర్‌గా కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా, శ్రీకాంత్‌కు ఏపీ ప్రభుత్వం తరఫున రూ. 7 లక్షల నగదు బహుమతి, తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించారు.