ఏపీ ఓపెన్ స్కూల్స్ టన్త్, ఇంటర్ ఫలితాలు నేడు ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నట్లు ఓపెన్ స్కూల్స్ సొసైటీ డైరెక్టర్ వెల్లడించారు. హాల్ టికెట్ నంబరు లేదా అడ్మిషన్ నంబరు ద్వారా www.apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌లో మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ సారి 6 లక్షలకు పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తే.. అందులో 4 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. సుమారు 2 లక్షల పైచిలుకు విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అయితే.. ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి మళ్లీ సంప్లీమెంటరీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు ఉపాధ్యాయులు. అంతేకాకుండా సంప్లీమెంటరీ ఫీజులను కూడా ఏపీ ప్రభుత్వం మినహాయించింది.