హైదరాబాద్‌లో మహిళల డెడ్ బాడీలు కలకలం రేపుతున్నాయి. చర్లపల్లి రైల్వై స్టేషన్ పక్కనే మహిళ డెడ్ బాడీ ఘటన మర్చిపోక ముందే రాజేంద్రనగర్ కిస్మత్‌పురా వద్ద మరో మహిళ మృతదేహం.. నగ్నంగా పడి ఉంది.
ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలపై ప్రైవేట్ ఆసుపత్రులు సమ్మెకు దిగుతాయన్న వార్తల నేపథ్యంలో, రాష్ట్రంలో 87 శాతం ఆసుపత్రులు యథావిధిగా సేవలు అందిస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు హైదరాబాద్‌లో ఒక గొప్ప కార్యక్రమం చేపట్టారు. అక్టోబర్ 9, 10 తేదీలలో ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ‘ఎలైట్ క్రికెట్ లీగ్’ ద్వారా సేకరించిన నిధులను అమరవీరుల కుటుంబాలకు అందజేయనున్నారు.
వికారాబాద్ జిల్లాలోని ఫుల్మద్ది గ్రామంలో ఒకే రోజు రెండు విషాదాలు చోటు చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అత్త మరణంతో శ్రద్ధాంజలి బ్యానర్‌ను తీసుకుని వెళ్తున్న అల్లుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
ఇంటి పన్ను వసూలు చేయడంలో మున్సిపల్ కార్పొరేషన్ చూపిస్తున్న శ్రద్ధ, రోడ్ల మరమ్మత్తులో చూపడం లేదంటూ కరీంనగర్ ప్రజలు తమ నిరసనను వినూత్నంగా తెలిపారు. రోడ్లపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో, వాటిలో వరి నాట్లు వేస్తూ 9వ డివిజన్లోని నివాసితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియా సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సరైన ముందుచూపు లేదని ఆయన ఆరోపించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ధాటిగా విరుచుకుపడ్డారు. "ప్రజాపాలనలో ప్రజలు లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? రేవంత్ రెడ్డి పాలన ప్రజలకు మేలు చేసేలా లేదు, ముడుపుల పాలనగా మారింది" అంటూ ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్త. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) ఒక భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,743 పోస్టులను భర్తీ చేయనున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి ఎల్‌అండ్‌టి కంపెనీ తప్పుకోవడానికి సీఎం రెవంత్ రెడ్డి వ్యవహార శైలి, బెదిరింపులే కారణమని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్ నగరంలోని నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)లో ర్యాగింగ్ ఘటన చోటుచేసుకుని కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న రిషాంత్ రెడ్డి అనే విద్యార్థి పుట్టినరోజు వేడుకల్లో తోటి విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.