Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పాత్రపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ప్రభాకర్ రావుకు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని, ఆయనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం వాదిస్తోంది. అమెరికాలో ఉన్న సమయంలో ప్రభాకర్ రావు తన నివాసంలోని ల్యాప్‌టాప్‌లోని ఆధారాలను ధ్వంసం చేశారని ప్రభుత్వం ఆరోపించింది.
Delhi: ఢిల్లీ-కోల్‌కతా హైవేపై భారీ ట్రాఫిక్ జామ్.. 4 రోజులుగా నిలిచిపోయిన వందలాది వాహనాలు
ఎఫ్‌ఎస్‌ఎల్ (Forensic Science Laboratory) నివేదికలో దీనికి సంబంధించిన స్పష్టమైన వివరాలు, తేదీలతో పాటు మొత్తం డేటాను రీసెట్ చేసినట్లు పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పలు జడ్జీలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్‌లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉండటంతో, ఈ విచారణపై దేశవ్యాప్తంగా దృష్టి సారించబడింది.
ICC ODI Rankings: ఐసిసి మహిళల వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో స్మృతి మంధాన