నెల్లూరులో డబుల్ మర్డర్ కలకలం.. పెన్నా బ్యారేజ్‌లో మృతదేహాలు..
వాళ్లిద్దరూ గిరిజనులు.. పెన్నా నది ఒడ్డున నివసిస్తూ.. చేపలు పట్టుకుని జీవనం సాగించేవారు.. అలాంటి వారిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత మార్చారు. కర్రలు రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఈడ్చుకుంటూ తీసుకు వచ్చి సమీపంలోని పెన్నా బ్యారేజ్‌లో పడేశారు.. భయాందోళన కలిగించే ఈ ఘటన నెల్లూరులోని పెన్నా బ్యారేజీ సమీపంలో జరిగింది. అసలు ఏం జరిగిందంటే.. నెల్లూరులోని రంగనాయకులు పేట సమీపంలో ఉన్న పెన్నా బ్యారేజ్ వద్ద రక్తపు చారలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సంతపేట పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే దృశ్యం కనిపించింది. రోడ్డుపైన రక్తపు చారలు ఉండడంతో.. పక్కనే ఉన్న బ్యారేజ్‌లో పరిశీలించారు. అందులో ఓ మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. దాన్ని బయటికి లాగే ప్రయత్నం చేస్తుండగానే.. సమీపంలో మరో మృతదేహాన్ని సంతపేట పోలీసులు గుర్తించారు. డబుల్ మర్డర్ జరిగిందని తెలియడంతో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.. స్పాట్..
దీపావళి రోజున సెలవుగా ప్రకటిస్తూ కాలిఫోర్నియా గవర్నర్ ఉత్తర్వు
అగ్ర రాజ్యం అమెరికాలో మరో కీలక ముందడుగు పడింది. భారతీయులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ దీపావళి భారతదేశంలోనే కాకుండా ఆయా దేశాల్లో కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇందుకు కాలిఫోర్నియా గవర్నర్ తీసుకున్న నిర్ణయమే ఉదాహరణగా నిలుస్తోంది. తాజాగా దీపావళి రోజున సెలవుగా ప్రకటిస్తూ కాలిఫోర్నియా గవర్నర్ ఉత్తర్వు జారీ చేశారు. దీపావళి పండగను అమెరికాలో సెలవు రోజుగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ గతంలో ఓ బిల్లు తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని కాలిఫోర్నియా స్టేల్ అసెంబ్లీ ఆమోదించింది. అసెంబ్లీ సభ్యుడు ఆష్ కల్రా ప్రవేశపెట్టిన బిల్లుపై సంతకం చేసినట్లు గవర్నర్ గవిన్ న్యూసమ్ మంగళవారం వెల్లడించారు.
ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ట్విస్ట్..
ములకలచెరువు నకిలీ మద్యం తయారి కేసులో ట్విస్ట్ నెలకొంది. నిందితుడు జనార్దన్ వైసీపీకి చెందిన రాంమోహన్ గోడన్ ను అద్దెకు తీసుకోని మద్యం తయారీ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తేలింది. గూడుపల్లికి చెందిన రాంమోహన్ వైసీపీలో యాక్టివ్ కార్యకర్త.. గతంలో అర్ కె డాబా పేరుతో హోటల్ నిర్వహించాడు. హైవే మార్పు చేయడంతో హోటల్ కు కష్టమర్లు రాకపోవడంతో మూసివేశాడు. జయచంద్రారెడ్డి సూచనతో అద్దెపల్లికి దాన్ని అద్దెకు ఇచ్చాడు. మరోవైపు.. తనకు ఎలాంటి సంబంధం లేదని తనపై వచ్చిన ఆరోపణలను కొట్టి పారేస్తూ.. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అని టీడీపీ ఇన్‌ఛార్జీ జయచంద్రారెడ్డి వీడియో విడుదల చేశాడు.
డాక్టరేట్ కావాలా..? పదో తరగతి ఫెయిల్ ఐనా పర్వాలేదు.. డబ్బులిస్తే చాలు..!
డాక్టరేట్ కావాలా..? పదో తరగతి ఫెయిల్ ఐనా పర్వాలేదు.. డబ్బులిస్తే చాలు !! సమాజంలో మీకంటూ గుర్తింపు కావాలని ఆశపడుతున్నారా ? ఇంకెందుకు ఆలస్యం.. అడిగినంత ఇచ్చేయండి.. డాక్టరేట్ పొందేయండి !! ప్రతిష్టాత్మక డాక్టరేట్లను అంగట్లో సరుకులా అమ్ముతున్నాడు ఓ మేధావి. డాక్టరేట్…!! పేరుకు ముందు ఈ పదం జోడించుకోవాలి అంటే ఎంతో ఘనత సాధించి ఉండాలి. లేదా పీహెచ్‌డీ చేసి ఉండాలి. సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వివిధ రంగాల్లో వాళ్లు చేస్తున్న కృషికి ఫలితంగా కొన్ని యూనివర్సిటీలు డాక్టరేట్లను ప్రదానం చేస్తుంటాయి. ప్రదానం చేసే యూనివర్సిటీలు కూడా చాలా ప్రాధాన్యత కలిగి ఉంటాయి. కానీ.. ఓ కేటుగాడు డాక్టరేట్లను అంగట్లో సరుకులా అమ్ముకుంటున్నాడు. డబ్బులిస్తే చాలు.. డాక్టరేట్లను చాక్లెట్లు పంచినట్లు పంచుతున్నాడు.
‘రౌడీ జనార్దన’.. మొదలెట్టనున్న కొండన్న.. ముహుర్తం ఎప్పుడంటే
విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయితే చేస్తున్నడు కానీ హిట్స్ మాత్రం రావట్లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖుషి, ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ కాగా రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ ప్లాప్ గా నిలిచింది. కింగ్డమ్ రిజల్ట్ తో కాస్త డీలా పడిన దేవరకొండ ఎలాగైన హిట్ కొట్టి తానేంటో మరోసారి నిరూపించాలని పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి రౌడీ జనార్దన. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ SVC బ్యానర్ లో వస్తున్న 49వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి రానివారు రాజావారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. తోలి సినిమాను క్లాస్ గా డైరెక్ట్ గా చేసిన ఈ దర్శకుడు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమాను తీసుకువస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలను ఈ దసరా కానుకగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. కానీ అనుకోని కారణాల వలన ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇక ఇప్పుడు ఈ నెల 11న పూజా కార్యక్రమాలు నిర్వచించనున్నారు. 16వ తేదీ నుండి షూట్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి తన మార్కెట్ ను కాపాడుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా కీర్తి సురేష్ నటించబోతుంది. అలాగే విజయ్ కు యంటాగొనిస్ట్ గా బాలీవుడ్ కు చెందిన స్టార్ నటుడి పేరును పరిశీలిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఈరోజు హైకోర్టు ఇవ్వబోయే తీర్పుతో ఎన్నికల భవితవ్యం తేలనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన రిజర్వేషన్ జీఓ చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఈ విచారణలో స్పష్టత రానుంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీఓ ప్రకారం, స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం కలిపి మొత్తం 67 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అయితే, సుప్రీంకోర్టు స్పష్టంగా 50 శాతం రిజర్వేషన్ పరిమితిని మించరాదని గతంలోనే తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనే అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు 18 కండీషన్లు..!
జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు షరతులతో కూడిన అనుమతి లభించింది. రూట్ మార్చి..18 కండీషన్లతో పోలీసులు అనుమతి ఇచ్చారు. పోలీసులు ప్రతిపాదించిన మార్గంలోనే జగన్ పర్యటన నిర్వహించేందుకు వైసీపీ నాయకత్వం అంగీకరించింది. ఈ అంశంపై మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడారు. “జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. స్టీల్ ప్లాంట్ కార్మికులను జగన్మోహన్ రెడ్డి కలవకుండా చూసేందుకు పోలీసులు రూట్ మార్చారు. భద్రత, టూర్ ఏర్పాట్లపై పోలీసులకు అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. ఎయిర్ పోర్టు నుంచి మేం ప్రతిపాదించిన మార్గం కాకుండా ప్రత్యామ్నాయం మార్గంలో అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన పర్మిషన్ ఎలా రావాలో.. ఎప్పుడు రావాలో మిమ్మల్ని మేం అడగలేదు. పోలీసులు తాజాగా ఇచ్చిన రూట్ మ్యాప్ ఆధారంగానే పర్యటన కొనసాగుతుంది.. స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితులు మార్గ మధ్యలో జగన్మోహన్ రెడ్డిని కలవచ్చు.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, బల్క్ డ్రగ్ పార్క్ సహా అన్ని సమస్యలపైన మా స్టాండ్ క్లియర్ గా ఉంది..” అని పేర్కొన్నారు.
ఉత్కంఠ పెరుగుతోంది.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు విచారణను మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా వేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో (జనరల్ ఆర్డర్) 42 శాతం బీసీ రిజర్వేషన్లను కలుపుతూ వివాదాస్పదంగా ఉంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిజర్వేషన్ల ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని ప్రశ్నించారు. లాయర్లు ప్రభుత్వం జీవోని, కొత్త రిజర్వేషన్ల షెడ్యూల్ ఇప్పటికే విడుదలై ఉన్నదని హైకోర్టుకు వివరించారు. అలాగే, సుప్రీంకోర్టు ఈ విషయంపై ఇప్పటికే కొన్ని అంశాలను తిరస్కరించిందని కూడా లాయర్లు ప్రస్తావించారు. ఈ కేసులో మొత్తం 6 పిటిషన్లు ఉన్నాయి. అన్ని పిటిషన్లను ఒకేసారి వింటామని హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పేర్కొన్నారు. విచారణ వాయిదా పడిన నేపథ్యంలో, బీసీ రిజర్వేషన్లపై తుది తీర్పు ఇంకా వేచి చూడవలసి ఉంది. హైకోర్టు నిర్ణయం రాష్ట్రంలో రిజర్వేషన్ల విధానంపై, విద్య, ఉద్యోగాల్లో బీసీ వర్గాలకు కల్పించాల్సిన ప్రాధాన్యతపై కీలక ప్రభావం చూపనుంది.
సుప్రీంకోర్టుకు విజయ్.. కరూర్ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని వినతి
కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే అధినేత విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కరూర్ తొక్కిసలాటపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా.. 60 మందికి పైగా గాయపడ్డారు. విజయ్ తరపున న్యాయవాదులు దీక్షితా గోహిల్, ప్రాంజల్ అగర్వాల్, యష్ ఎస్ విజయ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించడానికి ఇన్సిస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తూ మద్రాస్ హైకోర్టు అక్టోబర్ 3న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేశారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు కోరుతూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను విజయ్ సవాలు చేశారు. హైకోర్టు ఏర్పాటు చేసిన బృందంతో కాకుండా స్వతంత్ర దర్యాప్తు చేయాలని కోరారు.
జుబీన్ గార్గ్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్ట్
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణం కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, నిర్వాహకుడు శ్యామ్‌కాను మహంత, బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి, కో-సింగర్ అమృత్‌ప్రవ మహంతను అరెస్ట్ చేశారు. నలుగురిపై హత్య అభియోగాలు నమోదు చేశారు. తాజాగా మరొక కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సింగపూర్ యాచ్ పార్టీలో ఉన్న జుబీన్ గార్గ్ పోలీస్ బంధువు సందీపన్ గార్గ్‌ను అరెస్ట్ చేశారు. సందీపన్ గార్గ్.. జుబీన్ గార్గ్‌తోనే ఉన్నట్లుగా అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. సందీపన్ గార్గ్.. అస్సాం పోలీస్ సర్వీస్‌లో ఉన్నాడు. ఈ కేసులో ఐదో అరెస్టు అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. సందీపన్‌ను కోర్టులో హాజరుపరుస్తామని, పోలీసు రిమాండ్ కోరుతామని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్ ఎంపీ గుప్తా వెల్లడించారు. పోలీస్ సర్వీస్ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని అడిగినప్పుడు.. ఈరోజే అరెస్ట్ చేశామని సంబంధిత శాఖ తదుపరి చర్యలు తీసుకుంటుందని గుప్తా పేర్కొన్నారు.