విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు చాకచక్యంగా దాన్ని వెనక్కి మళ్లించారు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఉప్పల్ నియోజకవర్గం కాప్రాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆత్మగౌరవం, దేశభక్తి విలువలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత రెండు రోజులుగా హైదరాబాద్లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. సాయంత్రం వేళల్లో మొదలవుతున్న ఈ భారీ వర్షాలు నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. నిన్న కురిసిన కుండపోత వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఖమ్మం జిల్లా, వైరా మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి సీతక్క, ప్రజల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేసి బదనాం చేస్తోందని ఆరోపించారు.
భారత వైద్యరంగం ఒక కొత్త మైలురాయిని అధిగమించింది. టెలీసర్జరీ పద్ధతి ద్వారా హైదరాబాద్లో కూర్చున్న ఒక వైద్యుడు, గుర్గావ్లోని కేవలం 16 నెలల చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.
దురదృష్టవశాత్తు గుండెపోటు మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏ వయసు వారికైనా గుండెపోటు వచ్చే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో 30 ఏళ్ల యువకుడు గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది.
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ప్రచారంపై స్పందించారు. తన పదవికి రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని లేదా కొత్త పార్టీ పెడుతున్నానని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని ఆయన స్పష్టం చేశారు.
సైబర్ క్రిమినల్స్ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించడంతో.. వృద్దురాలు ప్రాణాలు కోల్పోయింది. తన తల్లి మృతికి సైబర్ నేరగాళ్లే కారణమని.. కొడుకు పోలీసులను ఆశ్రయించాడు.
హైదరాబాద్లో సెప్టెంబర్ 17న కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరం తడిసి ముద్దయింది. సాయంత్రం మొదలైన వర్షం రాత్రి 9 గంటల తర్వాత కూడా గంటపాటు విడవకుండా కురిసింది.
ఆస్తి కోసం కొంత మంది ఎంతకైనా తెగిస్తున్నారు. హైదరాబాద్లో తాజాగా జరిగిన ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. సైదాబాద్ విష్ణునగర్లో వృద్ధుడిని చంపేసిన కోడలు.. దోపిడీ దొంగల ప్రయత్నంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.